మరకట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విషాదం….
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం మరకట్టు వైసీపీ సీనియర్ నేత మాజి ఎంపిటిసి హనుమంతప్ప హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షి అన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హనమంతప్ప మృతి పార్టీకి తీరని లోటని అన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తుది శ్వాస వరకు ఆయన పనిచేశారని అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ఆకాంక్షించారు పార్ధివ దేహానికి పూల మాల వేసి సంతాపం తెలిపారు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే విరుపాక్షి ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు .ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.