PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

1 min read

ట్రాయ్ కాగ్ సభ్యులు బత్తుల సంజీవరాయుడు

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యమని ట్రాయ్ కాగ్ సభ్యులు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక  శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కళాశాలలో టెలికం వినియోగదారుల అవగాహన సదస్సు పిఎస్ఎస్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెలికామ్ నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ ప్రధాన బాధ్యతల్లో సెల్ వినియోగదారుల ప్రయోజనాలను సంరక్షించడం ఒకటి అన్నారు. మెరుగైన టెలికామ్ సేవలు అందించడం కోసం సెల్ కంపెనీలు అయిన జియో, ఎయిర్టెల్ , బిఎస్ఎన్ఎల్ , వోడాఫోన్ మొదలగు కంపెనీల సేవలపై నిబంధనలు , ఆదేశాలు , పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉత్తర్వులను జారీ చేస్తుందని పేర్కొన్నారు. టెలికామ్ రంగంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ద్వారా 110 కోట్ల మంది వినియోగదారులు మనదేశంలో మెరుగైన సేవలు ట్రాయ్ ద్వారా పొందుతున్నారన్నారు. వివిధ టెలికామ్ సేవలు మరియు కేబుల్ టీవీ సేవలు నాణ్యతా ప్రమాణాలను సమర్ధవంతంగా రూపొందించి వాటిని పటిష్టంగా అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనే స్వతంత్ర నియంత్రణ సంస్థను రూపకల్పన చేసి అమలులోకి తెచ్చిందని చెప్పారు. అంతేకాక ట్రాయ్ నిబంధనల ప్రకారము, టారిఫ్ సిస్టం  , వ్యాపార ప్రకటనల నిశిద్ధం , సేవల నాణ్యత ప్రమాణాలు , మొబైల్ నంబర్ పోర్టబుల్టి , సౌకర్యం విలువతో కూడిన సేవలు,  రక్షణ , వినియోగదారుల హక్కులు మరియు మొబైల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ ఆవిర్భావ ఆశయం అన్నారు. ప్రస్తుత తారీఫ్ ఇతర కంపెనీల కంటే తక్కువగా బిఎస్ఎన్ఎల్ ఉండడమే కాక బిఎస్ఎన్ఎల్ లో కూడా 4 జీ సేవలు రావడం ద్వారా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ ఎస్ఠీఓ శ్రీనివాసులు, జెటిఓ శంకర్ సిబ్బంది శివకుమార్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డే నారాయణ కళాశాల కరస్పాండెంట్ సుబ్బరాయుడు ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, సిబ్బంది తిమ్మయ్య, బాబు, మురుగేంద్ర, రమణమూర్తి, అభిలాష్ బసవరాజ్, వీరేష్, హనుమప్ప, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *