ప్రారంభమైన దక్షిణాంధ్ర ప్రదేశ్ బజరంగ్ దళ్ కార్యకర్తల శిక్షణా శిబిరం
1 min readవిశ్వ హిందూ పరిషత్ లో యువవిభాగమైన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ” బజరంగ్ దళ్ ” దక్షిణాంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యకర్తల శిక్షణ శిబిరం ఈరోజు 27/5/24 నుండి 2/5/24 వరకు జరుగుతుందని,ఈరోజు ఉదయం 11 గంటల నుండి మాంటేస్సొరి గ్రూప్ పాఠశాలల అధినేత రాజశేఖర్ సహకారంతో డోన్ రోడ్డులోని ఇండస్ పాఠశాల నందు ఘనంగా ప్రారంభమైనది. దక్షిణాంధ్ర రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ తూంకుంట ప్రతాపరెడ్డి ఉపోద్ఘాతం తో ప్రారంభమై దక్షిణాంధ్రప్రదేశ్ లో ఉన్న 16 జిల్లాల నుండి 200 మంది యువ బజరంగ్దళ్ కార్యకర్తలు ఈ యొక్కశిక్షణ శిబిరానికి హాజరయ్యారు. శిక్షణ శిబిరాన్నిశ్రీ శారదా పీఠం(కొలను భారతి)స్వామి శ్రీ శివయోగీంద్ర భారతి తన ఆశీఃప్రసంగం చేస్తూ భారతదేశం హిందూ దేశంగా ఉంటూ రామరాజ్యం స్థాపన కోసం దేశ విధానమైన సర్వమత సమానత్వం తో పరిఢవిల్లాలని కోరుతూ నేడు ఇంత మంది భారతదేశపు భవిష్యత్ నిర్దేశకులైన హిందూ యువకులు ఈ బజరంగ్ దళ్ శిక్షణా శిబిరంలో పాల్గొనడం చూస్తే భరతదేశం మొత్తం యువకులు ఇక్కడే ఉన్నట్టుగా చాలా ఆనందంగా ఉందని మీరందరూ ఇక్కడ చక్కగా శిక్షణ పొంది సమాజంలోని హిందుత్వానికి రక్షణగా ఉంటారని భావిస్తూ నా మంగళాశాశనములు తెలియజేస్తున్నామన్నారు. ప్రధాన వక్త గా విచ్చేసిన బజరంగ్ దళ్ ” భాగ్యనగర్ క్షేత్ర కన్వీనర్ వీర కుమార్ స్వామి ” మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ 60 సం.లు ( షష్ఠ్యబ్ది) పూర్తి చేసుకోబోతున్న ఈ శుభ సందర్భంలో …16 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న యువకులందరూ ఇక్కడ శిక్షణ పొందడానికి వచ్చారని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశం కోసం ధర్మం కోసం సేవ సురక్ష సంస్కార్ అనే ధ్యేయ వాక్యాలతో పనిచేసే విశ్వహిందూ పరిషత్ లోని యువ విభాగమైన భజరంగ్ దళ్ 1984 వ సంవత్సరం అక్టోబర్ 8 వతేదీన అప్పటి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు కీ.శే.మాన్య శ్రీ అశోక్ సింఘాల్, సాధుసంతుల ఆధ్వర్యం లో అయోధ్యలోని హనుమాన్ ఘడీ నందు “రామజానకి రథయాత్ర” సందర్భంగా రథాల రక్షణను కల్పించలేమని అప్పటి కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో బజరంగ్ దళ్ ఏర్పడిందని గత 40 సం.లు గా బజరంగ్ దళ్ హిందూ ధర్మం కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించిందని మరీ ముఖ్యంగా అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని తెలియజేయడానికి నేను చాలా గర్విస్తున్నాను ఇక్కడ జరిగే ఈ ఏడు రోజుల శిక్షణ శిబిరంలో యువకులకు దేశం పట్ల, ధర్మం పట్ల, చట్టాల పట్ల, సనాతన ధర్మం పట్ల హిందూ సమాజానికి వచ్చే అన్ని సవాళ్లను ఎదుర్కొనేలా శిక్షణ ఇస్తారని అలాగే యువకులంతా కూడా శరీరదారుఢ్యాన్ని, మానసిక ధైర్యాన్ని కలిగి ఉండడం కోసం ప్రత్యేక శారీరక శిక్షణ ఇస్తారని తద్వారా హిందూ యువకులు శక్తివంతులై హిందువులపై జరిగే అన్ని దాడులను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతారని, కావున ఇక్కడ శిక్షణకు వచ్చిన ప్రతి కార్యకర్త శ్రద్ధగా ఇక్కడ నేర్పించేవన్నీ నేర్చుకుని తమ తమ కార్యక్షేత్రాలలో సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ బజరంగ్ దళ్ ఆరాధ్య దేవతైన ఆ వీరాంజనేయుని ఆదర్శంగా తీసుకుని ఆయన లక్షణాలైన బుద్ధికుశలత, ఆత్మస్థైర్యం, సాహసం వంటివి ఆదర్శంగా తీసుకుని ఈ ఏడు రోజులు శిక్షణను పూర్తిచేయాలని పిలుపునిచ్ఛారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ సంఘటనా మంత్రి శ్రీనివాస రెడ్డి,దక్షిణాంధ్ర ప్రదేశ్ బజరంగ్ దళ్ కన్వీనర్ తూంకుంట ప్రతాపరెడ్డి, కో కన్వీనర్ పోలేపల్లి సందీప్, కోశాధికారి సందడి మహేశ్వర్ , సహ సేవా కన్వీనర్ గురుమూర్తి, బజరంగ్ దళ్ రాష్ట్ర విభాగం సభ్యులైన రవి,పెంచలయ్య,కమ్మయ్య,పిచ్చయ్య చౌదరి, శశీ కుమార్, కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ, కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, సహకార్యదర్శి గూడూరు గిరిబాబు, గోవిందరాజులు, జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ రాజేష్ ,నగర అధ్యక్షులు టి.సీ.మద్దిలేటి, ప్రఖంఢ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.