PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్యాన్సర్ స్క్రీనింగ్ పై శిక్షణ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మెడికల్ కళాశాల డాక్టర్ B.C రాయ్ మీటింగ్   హాలు నందు క్యాన్సర్ స్క్రీనింగ్ పై శిక్షణ కార్యక్రమము నిర్వహించడమైనది . ఈ శిక్షణ కార్యక్రమమునందు  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్. భాస్కర్ మాట్లాడుతూ 3.0 క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వేను త్వరలో మన రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు  తెలిపారు. అదిక రక్తపోటు ,  మధుమేహం  తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ 18 సంవత్సరముల పైబడిన స్త్రీ పురుషులకు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో   పనిచేయు చున్న ఆరోగ్య కార్యకర్తలు, MLHP లు మరియు  స్టాఫ్ నర్స్ లు సర్వే ద్వారా గుర్తించిన వారిని ప్రాథమిక , పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మరియు ఎఫ్ . బి .డి కార్యక్రమము నకు  రెఫెర్ చేసి వైద్యదికారులచే తదుపరి పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించి అంతేకాకుండా అవసరమైన వారిని పై స్థాయి ఆసుపత్రులకు పంపి చికిత్సలు మరియు ఫాలో అప్ సేవలు అందించేదరని తెలిపారు . ప్రారంభ దశలోనే ఈ కేసులను గుర్తించి సత్వర  చికిత్సలను అందించడం ద్వారా  వారి జీవిత కాలాన్ని పెంచవచ్చు నని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో PO, RBSK హేమలత  , ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్  డాక్టర్ మంజూష , గైనకాలజిస్ట్ డాక్టర్ సాహిత్య జయ రామ్ ,  డెంటిస్ట్ డాక్టర్ ఆదర్శ  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *