PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయులకు పరిశుభ్రతపై శిక్షణా కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు పట్టణంలోని కట్టమంచి రామలింగారెడ్డి స్మారక  నగరపాలక ఉన్నత పాఠశాల ఎస్ఏపీ క్యాంప్ డెటాల్ బనేగా స్వస్థ ఇండియా  గ్రామాలయం మరియు సార్డ్స్ (SARDS) సంస్థ ఆధ్వర్యంలో 50 పాఠశాలల నోడల్ అధికారులకు (ఉపాధ్యాయులకు) డెటాల్ భనేగా స్వస్త ఇండియా శిక్షణా కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ మన విద్యార్థులకు విద్యతోపాటు మంచి క్రమశిక్షణ, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత కుప్రాధాన్యతనిచ్చి విద్యార్థులకు ఉపాధ్యాయులే కాకుండా మంచి ప్రేరణ కర్తలుగా ఉండి వారి సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడాలని కోరారు మనం మన పాఠశాలలో స్వచ్ఛభారత్ అమలు పరచాలిసిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడు తీసుకోవాలని అన్నారు ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా పరిశుభ్రత నిర్వహణ కొరకు ఆయమ్మలు ఉన్నారని వారికి తగు సూచనలు ఇస్తూ పాఠశాలల పరిసరాల పరిశుభ్రత పై అవగాహన  కల్పించాల్సిన బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులదేనన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమగ్ర శిక్ష జిల్లా సహాయ విద్యా పరిశీలనాదికారి డాక్టర్ షేక్ రఫీ మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యం పై దృష్టి సారించాలని బాత్రూంలో మరుగుదొడ్లు ప్రతిరోజు రెండుసార్లు ఆయాలచే శుభ్రం చేయించాలని అవి పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల ఆరోగ్యము బాగుంటుందని ప్రతిరోజు భోజనానికి ముందు తర్వాత చేతులు కాళ్లు శుభ్రం చేసుకోవాలి అని అన్నారు. కర్నూలు మండలం అర్బన్ మండల విద్యాధికారి విజయకుమారిమాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పాఠశాలను తమ సొంతంగా భావించి విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి వారి ఆరోగ్యం పై పర్యవేక్షణ జరుపుతుండాలని పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం నిరంతరం అమలయ్యేలా చూడాలన్నారు.  డి బీ ఎస్ ఐ జిల్లా సమన్వయ అధికారి పి పుల్లన్న చేతుల శుభ్రపరిచే ఆరు రకాల విధానాల గురించి తెలియజేశారు డెటాల్ బనేగా స్వస్థ ఇండియా రాష్ట్ర సమన్వయకర్త కుమారి మాట్లాడుతూ ఈ పరిశుభ్రత కార్యక్రమం నిరంతర పర్యవేక్షణ చేయాలని వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం జరిగింది శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులచే కృత్యాలు చేయించడం జరిగింది ఉపాధ్యాయులు ఈ శిక్షణా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశాలు డిజిటల్ స్క్రీన్ పై వివరించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమానికి శిక్షకుడిగా దర్గయ్య ,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు షార్ట్స్ సంస్థ తరఫున సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.

About Author