సార్వతిక వ్యాధి నిరోధక టీకాలపై శిక్షణ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో వ్యాధినిరోధక టీకాలపై పట్టణ /ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న క్షేత్ర స్తాయి పర్యవేక్షకులకు సార్వతిక వ్యాధి నిరోధక టీకాలపై శిక్షన కార్యక్రమము నిర్వహించినారు, ఈ సందర్భంగా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ నాగప్రసాద్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి షెడ్యూల్డ్ ప్రకారము టీకాలు ఇవ్వడమువలనపోలియో,కంఠసర్పి,క్షయ,కామెర్లు,కోరింతదగ్గు,ధనుర్వాతము,నిమోనియా వంటి జబ్బులు రాకుండా నియంత్రించవచ్చునని తెలిపారు.సర్వలెన్స్ అధికారి డాక్టర్.వరుణ్ ధర్మన్ .మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని పిల్లల పేర్లు,వారికిచ్చే టీకాల వివరాలను ఖచ్చితంగా పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. 5 సంవత్సరములలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేసే విధానము,ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించినారు,ఇంటింటికి వెళ్ళి పర్రిశీలన చేసినప్పుడు సేకరించవలసిన వివరాలు,నివేదికలను ఎలా తయారు చేయాలి,ఆరోగ్య కేంద్ర స్తాయిలో ప్రణాళికలు ఎలా రూపొందించుకోవలనే అంశాలపై పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించినారు.ఈ కార్యక్రమములో RBSK సమన్వయకర్త హేమలత .న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి , క్షేత్ర స్తాయి పర్యవేక్షకులు ,ఆరోగ్య విద్యా బోదకురాలు పద్మావతి మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.