మతాలకతీతమైనది జ్ఞాన సముపార్జన
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జ్ఞానమంటే మతాలకు అతీతమైనదని, అది సార్వజనీనమైనదని, సమస్త భూతకోటికి శ్రేయస్సును కలిగించి, అందరినీ కలిపి ఉంచేదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, మిడుతూరు మండలం, మాసాపేట గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా వారు ప్రారంభోపన్యాసం చేశారు. తదనంతరం తెలుగు పండితులు గరుడాద్రి వనజ కుమారి శ్రీమద్రామాయణంపై చేసిన ఉపన్యాసం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో మిడుతూరు జెడ్పీటీసీ సభ్యులు పర్వతరెడ్డి యుగంధర్ రెడ్డి, గ్రామ పెద్దలు వంగూరు రఘునాథ రెడ్డి, కాల్వ రాధాకృష్ణ , పర్వత రెడ్డి శేఖర్ రెడ్డి, పరమేశ్వర రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, చంద్రారెడ్డి, పి.జనార్ధన రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కమతం జ్యోతి, సాయి వరరత్నంతో పాటు స్థానిక భజన మండలి సభ్యులు, సత్సంగ సభ్యులు పాల్గొన్నారు.