PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు

1 min read

సిన్సియారిటీ,సీనియార్టీని పక్కనపెట్టి ఆమ్యామ్యాలకు, ఆమాత్యుల సిఫార్సులకు తలోగుతున్నటు ఆరోపణలు

పసుపులేటి సత్య వరలక్ష్మి  రామచంద్రపురం సబ్ రిజిస్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్

పల్లెవెలుగు వెబ్  ఏలూరు  : కొత్త ప్రభుత్వం సంతరించుకున్న వంద రోజుల్లో బదిలీల ప్రక్రియ మొదలైంది. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి కార్యాలయం లో  గత రెండు రోజులుగా బదిలీల హడావుడి మొదలైంది. సిన్సియర్టీ ,సీనియార్టీ ని పక్కనపెట్టి ఆమ్యామ్యాలకు, ఆమాత్యుల సిఫార్సులకు అధికారులు తలగుతున్నట్టు సీనియర్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కులబలం, ధనబలం ఉన్నవారికి సంబంధిత ఉన్నతాధికారులు పెద్దపీట వేస్తున్నట్లు ఉద్యోగులు బాహాటంగానే చెప్తున్నారు. వారికి కావలసిన వారికి కావలసిన పోస్టింగ్ ఇవ్వటంలో  సిద్ధహస్తులని అన్నారు. మాలాటి సిన్సియారిటీ సీనియారిటీ ఉన్న వారికి రోజుల తరబడి, గంటల తరబడి వేచి ఉండవలసి  వస్తుందన్నారు. రామచంద్రాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పసుపులేటి సత్య వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నవారికి కావలసినచోట బదిలీ చేస్తే గాని కదిలేది లేదని భీష్మిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చుకోలేనందున బదిలీల జాబితాలో తన పేరు చివరి స్థానంలో పెట్టారని అన్నారు. తనను మాత్రం కోనసీమ జిల్లా రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళమన్నారని ఇది అన్యాయం అన్నారు. తనతోపాటు మరికొందరికి బదిలీల్లో అన్యాయం జరిగిందని మీడియా ముందు వాపోయారు. అయితే వారిని గొంతేత్తకుండా ఉన్నతాధికారులు కట్టడి చేస్తున్నారన్నారు.

About Author