ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్క్ షాప్ ను జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ఈనెల 28 29 30న నంద్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఎల్లయ్య,డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం కార్మికులకు పిలుపునిచ్చారు.బుధవారం ప్యాపిలి మండలం రాచర్ల ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర లారీ డ్రైవర్లతో వారు మాట్లాడుతూ రోడ్డు రవాణా రంగంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా,కార్మిక హక్కులను కాలరాసే విధానాలకు నిరసనగా ఫెడరేషన్ రాష్ట్ర వర్క్ షాప్ ను నంద్యాలలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బేతంచెర్ల నాయకులు రాజబాబు, టింగు,చిన్నవెంకటేష్,డ్రైవర్లు రంగనాయకులు,రామలింగం,శ్రీనివాసులు, కంబగిరిస్వామి, ఎం.కే.శ్రీనివాసులు,లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.