విద్యతోనే గిరిజనుల అభివృద్ధి…
1 min readఏపీ యస్ .టీ. కమీషన్ సభ్యులు శ్రీ వాడిత్య శంకర్ నాయక్ ….
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : విద్యతోనే గిరిజన ల అభివృద్ధి జరుగుతుందని అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యం ఇస్తుందని మరియు గిరిజనుల అభివృద్ధికి జిల్లా అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది అని ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ సభ్యులు శ్రీ వాడిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు.గురువారం సాయంకాలం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ సభ్యులు శ్రీ వాడిత్య శంకర్ నాయక్ పాత్రికేయుల తో సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ…మన రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గిరిజనులను అభివృద్ధి పదంలో నడిపించడం చేస్తుంది అని అన్నారు. తన జిల్లా పర్యటన సందర్భంగా గిరిజన ప్రజల నుండి కొన్ని విజ్ఞాపనలు వచ్చాయని ముఖ్యంగా జిల్లాలోని గిరిజన సంక్షేమ భవనాలను గురించి, గురుకుల పాఠశాల గురించి, మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల గ్రామాలలో ప్రాథమిక మౌలిక వసతులను గురించి వచ్చియని తెలిపారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో గిరిజనులకు సొంత స్కూల్ భవనాలు , హాస్టల్లో భవనాలు ఇంకా అవసరం ఉన్నదని వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ,ఉమ్మడి జిల్లాలో చాలామంది గిరిజనుల పిల్లలు డిగ్రీ స్థాయి వరకు చేరుకోలేకపోతున్నారని కావున ఆ పిల్లలందరినీ డిగ్రీ స్థాయి వరకు చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ,ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యపరంగా గిరిజనుల అవసరాల రీత్యా వారికి గ్రామాలలో సౌకర్యాలు ఇంకా మెరుగుపరచాలని , ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల లో గిరిజనులకు సంబంధించిన బ్యక్ లాగ్ పదవుల ఖాళీలు చాలా ఉన్నవి వాటిని వెంటనే భర్తీ చేయవలసిందిగా , అలాగే వారికి రావలసిన ప్రమోషన్లు వచ్చేల చర్యలు తీసుకోవాల్సిందిగా , గిరిజన గ్రామాలలో ఉపాధి హామీ పనులు పక్కగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని , గిరిజనులు సాగు చేసుకుంటున్నా భూములపై వారికి హక్కు కల్పించాలని గిరిజనులు కోరుకుంటున్నారని తెలియజేశారు.కమిటీ సభ్యునిగా నాకు అందిన గిరిజనుల విజ్ఞాపనలను కలెక్టర్ , ఎస్టి కమిషన్ ,రాష్ట్ర ప్రభుత్వము మరియు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశానికి గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ కూడా పాల్గొన్నారు.