త్రిబుల్ ఐటీ మెస్, కిచెన్ పరిశీలించిన రాష్ట్ర కళాశాల విద్యా శాఖ కమీషనర్
1 min readభోజనం,ఆహార పదార్థాలు, నాణ్యత పరిశీలన
విద్యార్థినీ విద్యార్థులను అడిగి పలు సమస్యలను తెలుసుకున్న కమిషనర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : నూజివీడు త్రిబుల్ ఐటీ లోని విద్యార్థుల మెస్, కిచెన్, డైనింగ్ హాళ్లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ కార్యదర్శి మరియు రాష్ట్ర కళాశాల విద్యా శాఖ కమీషనర్ డా:పోలా భాస్కర్ పరిశీలించారు. ముందుగా 1వ నెంబర్ మెస్ ని పరిశీలించి, అక్కడ ఆహార పదార్థాలు నాణ్యతను పరిశీలించారు. మెస్ భోజనం చేస్తున్న విద్యార్థులను కలిసి భోజనం నాణ్యత, వారి సమస్యలను కమీషనర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలికల మెస్ ను పరిశీలించి భోజనం నాణ్యత, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిచెన్ లో ఆహార తయారీ విధానాన్ని, పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆహార తయారీకి వినియోగించే సరుకుల నాణ్యతను కమీషనర్ పరిశీలించారు. కమీషనర్ వెంట జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ రామ్మోహన్ రావు,, నూజివీడు ఆర్డీఓ వై. భవానీశంకరి, త్రిబుల్ ఐటీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ఎమ్ . విజయకుమార్, రిజిస్ట్రార్ ఎస్. అమరేంద్రకుమార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి బండి ప్రసాద్, ఇంచార్జి తహసీల్దార్ సుబ్బారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.