PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంది నాటక రచయిత పల్లెటి లక్ష్మీ కులశేఖర్ కు కళాకారుల ఘన నివాళి ..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరం నందలి మద్దూరు నగర్ లో గల తెలుగుతోట యందు స్వర్గీయ నంది నాటక రచయిత, పద్య నాటక రచయిత, కీర్తిశేషులు పల్లేటి లక్ష్మీ కులశేఖర్ సంస్మరణ సంతాప సభ, కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అంకయ్య, రంగస్థల కళాకారులు, పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులు తెలిపారు. తెలుగు పద్య నాటక రంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 88 నంది అవార్డులు పొందిన పద్య నాటక రచయిత, కీర్తిశేషులు లక్మి కుల శేఖర్ కర్నూలు నగరం నందలి లలిత కళా సమితి వారు ప్రదర్శించిన నర నారాయణ, బబ్రువాహన, శ్రీకృష్ణ కమలపాలిక, ఆనంద నిలయం, శ్రీకృష్ణ భీమసేనం, పౌరాణిక పద్య నాటకాలకు 38 నంది అవార్డులు కర్నూలు రంగస్థల కళాకారులు అందుకోవడం జరిగింది. రాష్ట్రస్థాయిలో ఎందరో రంగస్థల కళాకారులకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల అనేక నందులు అందుకున్న వారు, అనేక అనేకులుగా రంగస్థలం కళాకారులు ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న వీరి సహాయార్థం లలిత కళా సమితి లక్ష రూపాయలు ఆర్థిక సహకారం కూడా అందజేయడం జరిగింది. పౌరాణిక పద్య నాటకాలకు అందవేసిన చేయి పల్లెటి లక్ష్మి కులశేఖర్ గారిది. గానం, ఆహార్యం,రంగాలంకరణ, సంగీతము, సాహిత్యము, పాటలు, మాటలు, దర్శకత్వ శాఖలలో ప్రత్యేక నైపుణ్యం గల ప్రత్యేక శైలి పల్లెటి లక్ష్మీ కులశేఖర్ అని కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు దర్శకులు వివి రమణారెడ్డి, సిహెచ్ చంద్రన్న, డి దస్తగిరి, బైలుప్పల షఫీయుల్లా, హనుమాన్ కళాసమితిఅధ్యక్షుడు పి హనుమంతరావు చౌదరి, జె ఎస్ ఆర్ కే శర్మ, కళాభారతి అరుణ కుమారి, టి రాజశేఖర్, శామ్యూల్, టి ఎన్ రెడ్డి, రచయిత లక్ష్మీ కులశేఖర్ ప్రతిభను గుర్తుకు తెచ్చుకున్నారు. రాజుకు కవులకు గల సంబంధాన్ని, సంగీత సాహిత్యాలతో పోల్చి, సభికులు రంగస్థల కళాకారులు లక్ష్మీ కుల శేఖర్ ను అభినందించారు, కృతజ్ఞతలు తెలిపారు. పల్లేటి లక్ష్మీ కుల శేఖర్ రచించిన పద్య నాటకం, శ్రీకృష్ణ జరాసందా నాటకాన్ని ప్రదర్శించాలని, కర్నూలు రంగస్థల కళాకారులు దర్శకులు వివి రమణారెడ్డి నిర్ణయించారు, కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు బైలుప్పల షఫీయుల్లా, జి అంకయ్య, వివి రమణారెడ్డి, సిహెచ్ చంద్రన్న, డి దస్తగిరి, సయ్యద్ రోషన్ అలీ సిబి అజయ్ కుమార్ శామ్యూల్, అరుణకుమారి, టి రాజశేఖర్, వివి రమణాచారి, డిఎన్వి సుబ్బయ్య, డి పుల్లయ్య, వివి రమణాచారి, ఆంజనేయులు, శిక్షావలి, టీవీ రెడ్డి, వెంకటేశ్వర్లు, పి గోవిందరాజులు, సుబ్బారావు, శ్రీనివాసులు, డి పార్వతి, ఎస్ డి వి అజీజ్, కళాకారులు రచయితలు అభిమానులు పాల్గొని కీర్తిశేషులు స్వర్గీయ పల్లేటి లక్ష్మీ కులశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఘన నివాళి అర్పించారు.

About Author