కాంగ్రెస్ పార్టీలో చేరికల సునామీ
1 min readపార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల సునామీ కొనసాగుతుంది. రోజురోజుకు పార్టీలో చేరికలు పెరిగిపోతున్నాయి . నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావడం పార్టీకి కలిసివచ్చే అంశం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్ కు ప్రజలలో మంచి పేరుంది.ఆర్థర్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. మంగళవారం నందికొట్కూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మిడుతూరు మండల నాయకులు నడిపి నాగన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోగురు ఆర్థర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తిమ్మాపురం మాజీ సర్పంచ్ పెద్ద ఉసేనయ్య, హనుమంతు, రవి, పెద్ద స్వామి.చేరారు. జూపాడు బంగ్లా మండలం కాంగ్రెస్ నాయకులు తాటిపాడు ఉస్మాన్ భాష ఆధ్వర్యంలో పారుమంచాల గ్రామం రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి మహమ్మద్ షరీఫ్, పైపాలెం కాంగ్రెస్ నాయకులు ఇనాయతుల్లా ఆధ్వర్యంలో నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని తాలూకా ఆఫీస్ రోడ్డు 28వ వార్డ్ వాసులు అరవింద, శ్రీనివాసులు, మాలిక్ భాషా, గుడ్ల బాబు ,చింత శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్థర్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గాబ్రియల్ ఆధ్వ ర్యంలో నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ మరియు విద్యానగర్ వాసులు సుభాన్, రామచంద్రుడు, బి. రవి, ఉస్మాన్ భాష, సుధీర్, వై.స్వామి దాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తేనె నాగరాజు ఆధ్వర్యంలో నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం మాసాపేట గ్రామస్తులు బి.అక్బర్ బాషా, టి. అశోక్ కుమార్, ఎస్ ఖాదర్ బాషా, బి.సలీం బాషా, ఎస్. వలి, ఎల్. మహబూబ్ బాషా, ఎల్ షాషావలి, c. కృష్ణమూర్తి, రియాజ్ వలి పార్టీలో చేరారు. వీరందరికీ ఆర్థర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆర్థర్ మాట్లాడుతూ త్వరలో మే13న జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు అందరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.