టిటిడి ఈవో, జేఈఈఓ లను తక్షణమే తొలగించాలి
1 min readటిటిడి దుర్ఘటన అత్యంత విషాదకరం
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
కాంగ్రెస్ నాయకులు పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: తిరుపతి విష్ణు నివాసం వద్ద వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన భక్తులకు, అదేవిధంగా గాయపడిన వారిని అటు ప్రభుత్వం, టీటీడీ ఆదుకోవాలని ఇందుకు బాధ్యులైన టీటీడీ ఈవో, జేఈఓ లను వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు పొట్టి పాటి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన చెన్నూరు లో విలేకరులతో మాట్లాడుతూ, తిరుపతిలో తొక్కిసలాటలో చనిపోయిన వారి పవిత్రాత్మ లకు శాంతిని ప్రసాధించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 8 వ తేదీ టిటిడి చరిత్రలో ఒక చీకటి రోజన్నారు. టోకెన్ల జారీ సందర్భంగా లక్షలాదిగా వచ్చిన భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో టిటిడి విఫలమైందని ఆయన అన్నారు. భద్రత విషయంలో కానీ భక్తుల సౌకర్యాలు కల్పించడంలో కానీ టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు అడిషనల్ ఈవో, వెంకన్న చౌదరి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. దీనికి బాధ్యులైనటువంటి వారందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. ఇలాంటి దుర్ఘటన టిటిడి చరిత్రలో మునుపెన్నడు జరగలేదన్నారు. తిరుపతి విష్ణు నివాసం వద్ద వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకన్లు ఇచ్చే సందర్భంగా జరిగిన తొక్కిస లాటలో తిరుపతి బైరాగి పట్టెడు కేంద్రం వద్ద బుద్ధేటి నాయుడు,మల్లికా,రజనీ,శాంతి,రాజేశ్వరి,నిర్మల అను 6 మంది చనిపోవడం,అందులో 5 గురు మహిళలు కావడం బాధాకరం అన్నారు. అధికారులు,పోలీసుల వైఫల్యం, సమన్వయ లోపం ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా టిటిడి, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురై స్విమ్స్, రుయా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న భక్తులందరూ కూడా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.