PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తుంగభద్ర బోర్డు వర్క్ ఛార్జ్ ఉద్యోగుల జీతాలను చెల్లించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​ హొళగుంద: తుంగభద్ర బోర్డు వర్క్ ఛార్జ్ ఉద్యోగుల జీతాలను చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు జీతం మరియు పెన్షన్ జాప్యం చేయకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి తమ జీతాలను సమయానికి అందించాలని టీబీ బోర్డు ఉన్నతాధికారులకు, నీటిపారుదల శాఖ మంతి నిమ్మల రామానాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరుతున్నారు. గత కొద్ది నెలలుగా జీతాలు అందకపోవడంతో గణనీయమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నామని కాల్వల మీద నీటి నియంత్రణలో మా ఉద్యోగాలు ఎంతో కష్టంగా ఉందన్నారు. ఎల్లెల్సీ, హెచ్ఎల్లెల్సీ కాలువల పై పగలనకా రాత్రినకా ఉద్యోగాలు చేస్తున్నమన్నారు. ఈ నీటి వనరుల పై ఆధారపడిన వ్యవసాయ రంగం మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతాన్ని ఆదుకోవడం నీటి వ్యవస్థల నిర్వహణ మా పని ఎంతో ముఖ్యమైందన్నారు. ఈ సవాళ్లతో సంబంధం లేకుండా మేం మరియు మా తోటి సిబ్బంది విధులను ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నమన్నారు. ఇప్పటి వరకు ట్రావెల్ అలవెన్సు చెల్లించలేదన్నారు. సిబ్బందికి ఎలాంటి ప్రయాణ భత్యం తిరిగి చెల్లించబడదన్నారు. ప్రస్తుతం తుంగభద్రలో భాగమైన వర్క్న్స్పెక్టర్లు, వర్చార్జ్లు ఎస్టాబ్లిన్మెంట్ యొక్క నిబద్ధత మరియు కృషికి మద్దతు ఇస్తున్నరన్నారు. రెండు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక టీబీ బోర్డులో ఉద్యోగాలు చేస్తున్నరన్నారు. ఈ విశ్వసనీయమైన ఆపరేషనన్ను నిర్దారించడం ద్వారా సమతుల్యతను కాపాడుకోవడంలో మా కాల్వకు మద్దతు ఇవ్వడంలో సహాయపడుతుందన్నారు. వ్యవస్థలు, ప్రాంతీయ స్థిరత్వం, వ్యవసాయ, ఉత్పాదికత, వరద నియంత్రణ, ఆనకట్ట భద్రత కోసం డ్యాన్సిన్ డివిజన్లో 24గంటలు అప్రమత్తంగా ఉండి అలాగే విద్యుత్, నీటి సరఫరా చార్జీలు, ఉదో యగ సంక్షేమం కోసం నివాస గృహాలు, టౌన్షిప్ మేనేజ్మెంట్ బృందం యూనిట్ల పనితీరు మాదన్నారు. జీతం, పింఛన్ సకాలంలో అందజేయాలని తుంగభద్ర బోర్డుకు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా ప్రయోజనంలేదని వారు వాపోయారు. ఆర్థిక అవసరాలే కాకుండా పణంగా పెట్టి తాము అంకితభావంతో ఉద్యోగం నిర్వహిస్తున్నామని తమ ఉద్యోగాలకు గౌరవం మరియు గుర్తింపు ఉండేలా రెండు రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే తాము చేసే ఉద్యోగంలో మద్దతు లభించదని ఆర్థిక సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు.

About Author