మలుపులు మలుపులు..ముచ్చుమర్రి కేసు
1 min readలాకప్ డెత్తా..ఆత్మహత్యా..?
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలోని సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి వాసంతి అదృశ్యం కేసు మలుపులు మలుపులు తిరుగుతోంది. ఈనెల 7 న అదృశ్యం అయిన బాలిక నేటికీ 16 రోజులు అయినా బాలిక ఆచూకీ లభించలేదు.ముగ్గురు మైనర్ బాలురు ఇద్దరి తండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి రిమాండ్ కు పంపారు.ఈ కేసులో అనుమానంతో ఒక మైనర్ బాలుడికి మేనమామ అయిన యోహాను (అలియాస్) హుస్సేన్ (35) అనుమానాస్పద స్థితిలో పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు.ఈ కేసులో పోలీస్ స్టేషన్ లాకప్ లో మరణించినట్లు తెలుస్తోంది. యోహన్ మృతదేహంపై గాయాలు ఉండటంతో శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్ లో పోలీసుల విచారణలో మరణించాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే యోహాను లాకప్ డెత్తా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. మరణించిన తర్వాత శనివారం ఉదయం లోపే యోహాన్ ను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. యోహాన్ మృతిపై పోలీసులు మాత్రం ఇంకా మౌనంగానే ఉండటం గమనార్హం.యోహాన్ మృతిపై పోస్టుమార్టం నివేదిక మరియు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. యోహాన్ స్వగ్రామం ముచ్చుమర్రి అయితే గత కొన్ని రోజులుగా నందికొట్కూరులో ఉంటున్నారు.