మహా కుంభమేళాకు ఫిబ్రవరి 4వ తేదీ రెండు బస్సులు ఏర్పాటు
1 min readపూరి,కోణార్క్,భువనేశ్వర్, ప్రయోగరాజ్ సంగమ స్థానం, కాశి,అయోధ్య,గయ, బు అద్దగయా తో తిరుగు ప్రయాణం
ఈ యాత్ర 8 రోజులు
రవాణాశాఖ అధికారి ఎన్.వి. ఆర్. ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా ఏలూరు నుండి మహా కుంభమేళాకు ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ప్రయాణికుల కోరికపై రెండు బస్సులు ఏర్పాటు చేయడమైనది .ఈ బస్సులుఏలూరులో బయలుదేరి పూరి, కోణార్క్,భువనేశ్వర్,ప్రయాగరాజ్ సంగమ స్థానం,కాశీ,అయోధ్య, గయా, బుద్ధగయ,తిరుగు ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన అరసవెల్లి సూర్య దేవాలయం ,శ్రీకూర్మం దర్శనం అనంతరం ఏలూరు చేరుకోవడం జరుగుతుంది.ఈ యాత్ర మొత్తం ఎనిమిది రోజులు.యాత్రికులకు ఉదయం,రాత్రి అల్పాహారం,మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా చేయడమైనది.యాత్ర మొత్తం ఖర్చు రు.12500/ గా నిర్ణయించడమైంది.ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ ప్రారంభమైంది. సర్వీసు నెం .48232,48236 మరిన్ని వివరాలకు 9346767670 పి ఆర్ ఓ ఫోన్ నెంబర్ సంప్రదించగలరు.ఇటీవల జరిగిన సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ కి 572 స్పెషల్ బస్సులు తిప్పడం జరిగిందని తద్వారా రు .1.14 / కోటి 14 లక్షలు ఆదాయం వచ్చిందని గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పది లక్షలు ఎక్కువ ఆదాయం వచ్చిందని ఆర్టీసీ బస్సులు ఎంచుకొని ప్రయాణించిన ప్రతి ప్రయాణికుడికి ధన్యవాదాలు తెలియజేశారు. ఫిబ్రవరి 26వ తేదీన వచ్చే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఏలూరుకి సమీపం అయిన బలివే క్షేత్రానికి ఏలూరు,నూజివీడు నుండి 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడమైందని,పట్టిసీమకి జంగారెడ్డిగూడెం నుండి 30 బస్సులు తాడేపల్లిగూడెం నుండి 20 బస్సులు,తాడేపల్లిగూడెం వద్ద కల వీరంపాలెం కు తాడేపల్లిగూడెం నుండి 10 బస్సులు ,ఏలూరు నుండి 4బస్సులు,ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా ఫిబ్రవరి 7, 8 తేదీలలో జరిగే అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణానికి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 50 బస్సులు ఏర్పాటు చేయబడ్డాయని కాబట్టి ఏ జాతర కార్యక్రమం జరిగిన ఆర్టీసీ ముందుండి బస్సులను నడుపుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్ విఆర్ ప్రసాద్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏలు రు డిపో మేనేజర్ బి. వాణి,ఏ.ఎం.టి, జి.మురళి, పి.ఆర్వో ‘కేఎల్వి నరసింహం పాల్గొన్నారు.