PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల్యాబ్ టెక్నీషియన్లకు రెండు రోజుల శిక్షణ

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు (మిడుతూరు): నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సిహెచ్సి సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జిల్లా మలేరియా అధికారి వి. కామేశ్వరరావు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి కామేశ్వరరావు మాట్లాడుతూ ఈ రెండు రోజుల శిక్షణను ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ సద్వినియోగం చేసుకోవాలని మలేరియా రక్త పూతలు ఏ విధంగా సేకరించాలి..వాటిని ఏ విధంగా పరీక్షించాలి మలేరియా వ్యాప్తిని అరికట్టుటలో తమ వంతు సహకారం అందించాలని 2027 కల్లా మలేరియా ఎలిమినేషన్ జరిగేటట్లు చూడాలన్నారు. అదేవిధంగా మలేరియా మైక్రోస్కోప్ నందు మలేరియా పరాన్న జీవి ఏ విధంగా ఉంటుందో పరీక్షించి తెలుసుకోవాలని ల్యాబ్ టెక్నీషియన్లతో ఆయన అన్నారు. జిల్లా సహాయ మలేరియా అధికారి జి వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ జిల్లాలో మూడు బ్యాచ్ ల వారీగా నందికొట్కూరు లోనే రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.సబ్ యూనిట్ అధికారి ఎం రామకృష్ణ,కే సుబ్బ లక్ష్మయ్య ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చారు.

About Author