వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం
1 min readవయోజన విద్య అక్షరాస్యత వాలంటీర్లకు పుస్తకాలు పంపిణీ
జిల్లాలో నిరక్ష్యరాశులను అక్షరాశులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఏలూరు జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి కెవివి సత్యనారాయణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు ప్రతినిధి: వయోజన విద్య ఉల్లాస్ అక్షరాస్యత ద్వారా శిక్షణ పొందిన డ్వాక్రా వాలంటీర్లు, నిరక్ష్యరాసులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఏలూరు జిల్లా వయోజనవిద్యా నోడల్ అధికారి కె.వి.వి సత్యనారాయణ అన్నారు. ఏలూరు మండల డ్వాక్రా భవనంలో శనివారం వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎంపిడిఓ శ్రీలత చేతులమీదుగా శిక్షణ పొందిన డ్వాక్రా వాలంటీర్లకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఏలూరు మండలంలోని డ్వాక్రా గ్రూపు మహిళలలో మొదటి విడతగా 310 మంది నిరక్ష్యరాసులను గుర్తించి, వీరందినీ అక్షరాస్యులుగా చేసేందుకు 31 వాలంటీర్లు నియమించినట్లు ఏపిఎం నాగేశ్వరరావు తెలిపారు.వీరంతా ఆయా గ్రామాల్లోని నిరక్ష్యరాసులకు 3 నెలలు పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత కోసం పరీక్షలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా సిసిలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.