ఏకగ్రీవంగా నీటిపారుదల ఎన్నికలు..
1 min readపల్లెవెలుగు మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో శనివారం నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికలు మండలంలో నాలుగు గ్రామాల్లో నిర్వహించారు.అందులో తలముడిపి,జలకనూరు గ్రామాల్లో నీటి సంఘాల ఎన్నికలు వాయిదా వేసినట్లు చింతలపల్లి,మంచాలకట్ట గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించగా చింతలపల్లి గ్రామంలోని పోచవాగు నీటి సంఘానికి ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా అధ్యక్షులు కైపా సీతారాం రెడ్డి ఉపాధ్యక్షులు తలారి వెంకటేశ్వర్లు ఎన్ని కోవడం జరిగిందని అలాగే మంచాలకట్ట గ్రామం మద్దిలేరు వాగు చిన్న నీటిపారుదల ట్యాంక్ ఎన్నికల్లో 6 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వీరిలో అధ్యక్షులుగా మంచాలకట్ట గ్రామానికి చెందిన మురళీ మోహన్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా తలముడిపి గ్రామానికి చెందిన జగన్నాథ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.ఏకగ్రీవంగా ఎన్నిక అయిన వారిని టీడీపీ మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి మరియు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.