తుంగభద్ర ప్రాజెక్ట్ ఎల్.ఎల్.సి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు తుంగభద్ర ప్రాజెక్ట్ ఎల్.ఎల్.సి చైర్మన్ గా మంత్రాలయం నియోజకవర్గమునకు చెందిన పి.టిప్పు సుల్తాన్ ని, ఉపాధ్యక్షులు గా ఎమ్మిగనూరు నియోజకవర్గమునకు చెందిన శ్రీ బొయగడ్డ హుస్సేన్ సహెబ్ ని మరియు గాజులదిన్నె ప్రాజెక్ట్ చైర్మన్ గా కోడుమూరు నియోజకవర్గమునకు చెందిన శ్రీ కె.ఇ.మల్లికార్జున గౌడ్ ని, ఉపాధ్యక్షులుగా పత్తికొంద నియోజకవర్గమునకు చెందిన కొడిదెల చిన్న మద్దయ్య ని టి.సి లు మరియు డి.సిలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం పార్టీ ఇంచార్జిఎన్.రాఘవేంద్ర రెడ్డి , కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ లు మరియు ఉపాధ్యక్షులను పూల మాల వేసి శాలువాతో సత్కరించడం జరిగింది.