ఎడతెరిపిలేని భారీ వర్షాలు- నెలకు ఒరిగిన వరి పంట
1 min readచెన్నూరు వద్ద పెరుగుతున్న పెన్నా నది ఉదృతి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫలితంగా చెన్నూరు మండల వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం పగలు రాత్రి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. మంగళవారం 30.2 మిల్లీమీటర్లు. బుధవారం ఉదయం30.4 మిల్లీమీటర్లు. బుధవారం మధ్యాహ్నం20.5 మిల్లీమీటర్లు వర్షం నమోదైనట్లు మండల తాసిల్దార్ సరస్వతి తెలిపారు. పెన్నా నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కుందు పాపాగ్ని ఒక్కిలేరు చిన్నపాటి వంకలనుంచి వరద నీరంతా పెన్నా నదిలోకి చేరుతున్నది. బుధవారం సాయంత్రానికి చెన్నూరు వద్ద పెన్నా నదిలో21వేల క్యూసెక్కులు నీరు దిగువనున్న సోమశిల జలాశయంలోకి చేరుతున్నాయి. చెన్నూరు వద్ద సెంట్రల్ వాటర్ సిబ్బంది నీటి వేగాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే ఆది నిమ్మాయిపల్లి పెన్నా నది ఆనకట్ట వద్ద కె సి కెనాల్ అధికారులు ఎప్పటికప్పుడు నేటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. మైలవరం జలాశయం నుంచి నీటిని వదలడంతో పెన్నా నది పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చెన్నూరు సీఐ. పురుషోత్తం రాజు. తాసిల్దార్ . సరస్వతి మాట్లాడుతూ పెన్నా నదిలో ఎవరు దిగొద్దని హెచ్చరించారు. పెన్నా నది వద్ద నిఘ ఏర్పాటు చేశారు రెండు రోజులపాటు వర్షాలు కురవడంతో చెన్నూరు. రామనపల్లి. కొండపేట. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట నేలకొరడంతో బుధవారం మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి ఆయా ప్రాంతాల్లో పంటలను పరిశీలించారు. భారీ వర్షాలు కారణంగా చెన్నూరు లోని పలు లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల పైన వర్షపు నీరు చేరింది. చెన్నూరు భవన్ నగర్. బుడ్డాయిపల్లి. కొత్త రోడ్డు. పలు కాలనీలలో వర్షంనీరు చేరింది. కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎగతాటిగా వర్షాలు కురవడంతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.