ఉడికీ ఉడకని అన్నం.. ఎమ్మెల్యే సీరియస్
1 min readఎత్తిపోతల పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తా:ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆకస్మిక తనిఖీ చేసి పంట నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం నందికొట్కూరు మండల పరిధిలోని నాగటూరు లో ఎంపీపీ పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు అదే విధంగా పిల్లలకు వడ్డించే భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించగా వంటలు సరిగ్గా లేకపోవడంతో ఎమ్మెల్యే వంట నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. తర్వాత నాగటూరు ఎత్తిపోతల పథకాన్ని రైతులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.గత ప్రభుత్వ హయాంలో పాలకులు ఈ పథకాన్ని పట్టించుకోలేదని ఈ పథకం రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని కాలువలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.నిరుపయోగంగా ఉన్న ఈ పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. తర్వాత కొణిదేల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. అక్కడ కూడా నాణ్యమైన భోజనం లేకపోవడంతో వంట నిర్వాహకులు మరియు ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం ప్రతి రోజూ అందించాలని విద్యార్థులకు అందించే భోజనం సరిగ్గా లేనట్లయితే పై అధికారుల దృష్టికి తీసుకు పో వాల్సి వస్తుందని ఎమ్మెల్యే వారిని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కొణిదెల సర్పంచ్ నవీన్,నాగటూరు సర్పంచ్,పగిడాల టిడిపి మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి,బ్రహ్మానంద రెడ్డి, ఏబీఎం పాలెం నాగ సురేష్, రాజు రంగస్వామి నరసింహారెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.