మల్లెల గ్రూప్స్ ఆధ్వర్యంలో.. అందరి క్రిస్మస్ వేడుకలు
1 min read300 మంది వికలాంగులకు,వృద్ధులకు, వితంతువులకు దుస్తులు పంపిణీ చేసిన మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో మల్లెల గ్రూప్స్ అధినేత, డా.మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో గురువారం ఎమ్మిగనూరు పట్టణంలో క్రిస్టియన్ రిఫార్మ్డ్ చర్చి ఆవరణం నందు “అందరి క్రిస్మస్ వేడుకలు” ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మల్లెల అల్ ఫ్రెడ్ రాజు 300 మందికి పైగా వికలాంగులకు, వృద్ధులకు,వితంతువులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.సి చర్చి పాస్టర్ యం.యస్.రవితేజ వాక్యోపదేశం చేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమే నిజమైన క్రిస్మస్ అని,క్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సభలో మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు గారి సతీమణి సిస్టర్ మల్లెల సునీల ఆలపించిన క్రైస్తవ మధుర గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాల్ కోట ఖదీర్, జమాత్ – ఏ- ఇస్లామ్ హిందూ అధ్యక్షులు చాంద్ బాష లు మాట్లాడుతూ.. మల్లెల ఆల్ ఫ్రె డ్ రాజు కుల,మతాలకు అతీతంగా చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. గత 19 సంవత్సరాల నుండి పేదలకు “క్రిస్మస్ పండుగ” ను పురస్కరించుకొని దుస్తులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు తన పుణ్య తల్లిదండ్రులైన దివంగతులు జీవరత్నం, సుశీలమ్మల స్ఫూర్తితో అణగారిన వర్గాలకు అండగా ఉంటున్నారని, మన మతం, మన తత్వం, మానవత్వంగా పయనిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో… సి ఆర్ సి చర్చి సంఘ పెద్దలు దేవ ప్రసాద్, సాల్మన్, ఐడియల్ యూత్ మూమెంట్ అధ్యక్షులు ముల్లా ఇస్మాయిల్, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు బీసీ నాగరాజు, పూలే,అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ సింగనేటి నరసన్న, ప్రతిభా భారతి, బీసీ సంఘం నాయకులు డాక్టర్ గణేష్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళ ఐక్యవేదిక నాయకురాలు ఈ.భారతమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ సూపర్వైజర్ యు.రాము, మల్లెల గ్రూప్ సభ్యులు న్యూ లైఫ్ సామేలు, శంకర్, అజిత్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.