వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి నిరుద్యోగ భృతి
1 min readనిరుద్యోగ వేద పండితుల నుండి దరఖాస్తులు స్వీకరణ
నెల ఒక్కంటికి 3,000/- రూపాయలు ప్రభుత్వ భృతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులగా ఉన్న వారికీ నిరుద్యోగ భృతి నెల ఒక్కింటికి రూ.3,000/-రూపాయలు పొందుటకు నిరుద్యోగ వేద పండితులు నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా దేవదాయ శాఖ అధికారి సి.హెచ్.రంగారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులు గా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి వారు, నిరుద్యోగ భృతిని పొందుటకు వేదవిధ్య (క్రమాంతం ఆపై కోర్సులు చదివిన వారు) సర్టిఫికెట్లు నఖలు, ఆధార్ నఖలు, బ్యాంకు అకౌంట్ వివరములు మరియు ఏ విధమైన ఉద్యోగం చేయుట లేదని స్వీయ ధృవపత్రం తో వారి దరఖాస్తులను జిల్లా దేవదాయ శాఖ అధికారి, దేవదాయ ధర్మదాయ శాఖ, పవర్ పేట, గాదేవారి వీధి, ఏలూరు వారి కార్యాలయమునకు ది.26-09-2024 సాయంత్రం 500 గం.ల లోపు సమర్పించవలసినదిగా ఇతర వివరాలకు ఫోన్ నెం. 8333811582 నందు సంప్రదించవలసిందిగా కోరారు.