రైలు పట్టాలపై గుర్తుతెలియ మృతదేహం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: నంద్యాల, నంది పల్లె మార్గ మధ్యలో ఉన్న రైలు పట్టాలపై రైలు ప్రమాదంలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు గుర్తించామని రైల్వే పోలీసులు తెలిపారు. దాదాపు 25 నుండి 30 సంవత్సరాలు వయస్సు గల యువకుడు తెల్లని, పసుపచ్చ వర్ణంలో ఉన్న టీ షర్టు ధరించడంతోపాటు కుడి చేతికి ఒక గడియారం( వాచీ) ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసు వర్గాలు తెలిపాయి.