PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూనిఫామ్ క్వాలిటీ పరిశీలించిన ఎంఈఓ

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు మండలానికి సంబంధించి  2024-25 సంవత్సరానికి విద్యార్థుల యూనిఫామ్ నాణ్యత ను మండల విద్యాధికారి-1 గంగిరెడ్డి, విద్యాధికారి- 2 సునీత, బుధవారం  పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని అన్ని పాఠశాలలకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు మండల కేంద్రానికి చేరాయని, వాటన్నిటిని కూడా నాణ్యతను పరిశీలించడం జరిగిందన్నారు, ఇంకా షూస్ అందలేదని త్వరలోనే పాఠశాల పునః ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు, ఇవన్నీ కూడా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చేరవేయడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సీఎంఓ (కమ్యూనిటీ మొబైల్ ఆఫీసర్ )కేశవరెడ్డి, అసిస్టెంట్ కమ్యూనిటీ మొబైల్ ఆఫీసర్ దశరధరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

About Author