కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తఫ్ చేయాలి
1 min readమహానంది డిమాండ్
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరులో అంబేద్కర్ సర్కిల్ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను అవమానకరంగా విమర్శించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని రాస్తారోక, నిరసన, కార్యక్రమంనిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు మహానంది మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా చట్ట సభల్లోకి వచ్చిన అమిత్ షా బాధ్యతగల కేంద్ర హోం మంత్రి పదవిలో ఉండి మతోన్మాదిగా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ప్రపంచ దేశాల్లోడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో, సూచనలు పాటిస్తుంటే ఈ మతోన్మాదులుకుల అహంకార భావంతో మాట్లాడుతున్నారని యా వత్తు ప్రజానికం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన సమయం వచ్చిందనిఆయన అన్నారు,ఈ దేశం స్వేచ్ఛసౌభాగ్యాలతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందంటే భారత రాజ్యాంగం వలనేననిఆయన అన్నారు, అమిత్ షాకు మతోన్మాదానికి వ్యతిరేకంగా దశలవారీగా ఆందోళన నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు తాలూకా కన్వీనర్ భరత్, పలుకుంద మండల కన్వీనర్ మల్లికార్జున, యూత్ కన్వీనర్ వెంకట్ రాముడు, రామాంజనేయులు,మల్లికార్జున,పరమేష్, వెంకటేష్,రాజు,సూరి, నాగరాజు,నాగేంద్ర, మల్లేష్, ధనుంజయ,రాజప్ప, యాదగిరి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.