దేశ ప్రజలకు కేంద్ర హోం శాఖ మంత్రి క్షమాపణలు చెప్పాలి.. ఎస్డీపిఐ డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : మంగళవారం 17/12/2024 తేదీన పార్లమెంట్ సమావేశాలలో బిజెపి పార్టీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు కోరాలని లేని పక్షంలో మంత్రి పదవి నుండి తొలగించాలని దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా పత్రికా సమావేశం నందు SDPI ఆలురుఅసెంబ్లీ అద్యక్షులు F. హమీద్, ప్రధాన కార్యదర్శి N. సుబాన్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కని అవహేళన చేయడం రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే బిజెపి చేస్తున్న నీఛ రాజకీయాలకు రాజ్యాంగాన్ని గౌరవించే దేశ ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పేంతవరకు యస్ డి పి ఐ సహించేది లేదని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో SDPI, నాయకులూ సలాం , హఫీజ్, హరున్, కార్యకర్తలు పాల్గొన్నారు.