PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన సంఘాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: AIDSO – AIMSS – AIDYO సంఘాల ఆధ్వర్యంలో  కలకత్తాలో మహిళా జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ, వాటికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు, RG KAR ఆసుపత్రి వద్ద డాక్టర్లపై చేసిన మూక దాడిని ఖండిస్తూ విద్యార్థులతో నగరంలో ర్యాలీ చేపట్టి, జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో SUCI (C) పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు  డి. రాఘవేంద్ర, AIDSO రాష్ట్ర అధ్యక్షులు వి .హరీష్ కుమార్ రెడ్డి, AIMSS రాష్ట్ర కార్యదర్శి ఎం.తేజోవతి , AIDYO నాయకులు శక్రప్ప, ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటి రాష్ట్ర నాయకులు కె. ఓంకార్, డి. రామశేషయ్య  జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు… వారు మాట్లాడుతూ అత్యంత పాశవికంగా అమానవీయంగా మెడికల్ విద్యార్థిని అత్యాచారం చేసి చంపిన నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వాలు, పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. అమ్మాయి మీద ఒకరు కాకుండా అనేక మంది అత్యాచారానికి పాల్పడ్డారని మిగతా నిందితులు ఎవరినీ కూడా ఇంతవరకూ పట్టుకోకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు… దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతూ ఉంటే మరణించిన కుటుంబం మాత్రం శోకంలో మునిగిపోయారని, భేటీ పడావో అంటే ఇదేనా అని ప్రశ్నించారు.ఒక సమాజం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసు కోవాలంటే ఆ సమాజంలోని మహిళల అభివృద్ధియే కొలమానమని అన్నారు… కాని ప్రస్తుతం మన దేశంలో మహిళల పరిస్థితిని చూసినట్లయితే పుట్టిన బిడ్డ నుండి కాటికి కాలుచాచిన ముదుసలి వరకు ఎక్కడా మహిళలకు రక్షణ అనేది లేదని, ఇంటా, బయట, పాఠశాల, కాలేజీ, ఆఫీసు ఎక్కడా మహిళలకు రక్షణ భద్రత లేదన్నారు. నెలల పసికందులపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే వావివరుసలు మరచి తండ్రే కూతురుపై అత్యాచారం చేయడం, అన్న చెల్లెలిపై అత్యాచారం చేయడం వంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయని గుర్తు చేశారు… నేడు విద్యార్థులు, యువతీ యువకుల్లో మద్యపానం, గంజాయి వాడకం, మాదకద్రవ్య వ్యసనం పెచ్చు పెరుగుతున్నాయని, మరో పక్కఅశ్లీల చిత్రాలు, పుస్తకాలు, సినిమాలకు అలవాటు పడేలా, స్త్రీ శరీరంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ స్త్రీలను వెంబడించడం వంటివి తారా స్థాయికి పెరిగి పోతున్నాయని, అనైతిక లైంగిక కార్యకలాపాలలో మునిగిపోతున్నారని తెలిపారు… ఇలాంటి దిగజారిన విష సంస్కృతి గ్రామాల్లోని పేదల్లోకి కూడా చొరబడిందని, ఇప్పుడు ఇవన్నీ పసిపిల్లల మొదళ్లులోకి కూడా చేరుతున్నాయని, ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో నేటి పిల్లలను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరింతగా సొంత ఇంట్లోనే పునరావృతం అవుతాయని హెచ్చరించారు… మహిళల, బాలికల, అమ్మాయిల రక్షణలో ప్రముఖ పాత్ర వహించాల్సిన రక్షణ వ్యవస్థ పూర్తి నిర్లక్ష ధోరణితో వ్యవహరిస్తోందని, న్యాయం చేయడంలో న్యాయ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, నిర్భయ చట్టం, దిశా చట్టం ఇలా ఎన్నో చట్టాలు చేసినప్పటికీ అవి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైనదని దుయ్యబట్టారు.నేడు మహిళలకు, బాలికలకు అమ్మాయిలకు రక్షణ,గౌరవం కావాలంటే మానవ మృగాలుగా మారుస్తున్న మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల సినిమా సాహిత్యాలు, ఫోర్నోగ్రఫీ, డ్రగ్స్, బెట్టింగ్ లను నిషేధించాలని రక్షణ, న్యాయ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించాలని, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు రావాలని, గొప్ప వ్యక్తులైన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వారిని విద్యార్థులకు ఆదర్శంగా తీసుకునేలా, వారి గురించి పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో AIDSO నగర కార్యదర్శి మల్లేష్, AIMSS నాయకులు రోజా, ఖాదర్, నవీన్, ఖాజా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author