హైందవ సంస్కృతి పరిరక్షించబడినపుడే విశ్వశాంతి వర్ధిల్లుతుంది
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నిత్యం సర్వేజనా సుఖినోభవంతు అనే ద్యేయవాక్యం కలిగిన హైందవ సంస్కృతి పరిరక్షించబడినపుడే విశ్వశాంతి వర్ధిల్లుతుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. సకల ప్రాణుల పట్ల దయకలిగి ఉండాలని, దైవం దృష్టిలో అన్ని ప్రాణులు సమానమేనని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా,మిడుతూరు మండలం, మాసాపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధార్మిక సభా కార్యక్రమంలో వారు ప్రసంగించారు. మూడు రోజులపాటు తెలుగు పండితులు గరుడాద్రి వనజ కుమారి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మిడుతూరు జెడ్పీటీసీ సభ్యులు పర్వతరెడ్డి యుగంధర్ రెడ్డి, గ్రామ పెద్దలు వంగూరు రఘునాథ రెడ్డి, కాల్వ రాధాకృష్ణ , పర్వత రెడ్డి శేఖర్ రెడ్డి, పరమేశ్వర రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, చంద్రారెడ్డి, పి.జనార్ధన రెడ్డి, వంగూరు రామసుబ్బారెడ్డి, వి వెంకట రెడ్డి, వి.పెద్ద వెంకటరామిరెడ్డి, వి.రఘునాథ్ రెడ్డి, బాబురెడ్డి, మధుసూదన్ రెడ్డి, కమతం జ్యోతి, సాయి వరరత్నంతో పాటు స్థానిక భజన మండలి సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.