అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
1 min readసీఐ పురుషోత్తం రాజు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలో ఎవరైనా ఎంతటి వ్యక్తులైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ పురుషోత్తం రాజు అన్నారు, గురువారం ఆయన చెన్నూర్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెన్నూరు మండలం పాడి పంటలకు, మతసామరస్యాలకు ప్రశాంతతకు ఎంతో పేరు పొందిందనదని ఇలాంటి మండలంలో ఎవరైనా అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు, గుట్కా, గంజాయి, మట్కా, సారాయి, క్రికెట్ బెట్టింగ్ ఇసుక వంటి వాటికి పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలియజేశారు, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి తగిన చర్యలు చేపడతామని, దీనికి సంబంధించి వాహనదారులు కూడా రోడ్డు నిబంధనలు పాటించాలని ఆయన తెలియజేశారు.