PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టణ అభివృద్ధే  ప్రధాన లక్ష్యం…

1 min read

రహదారులను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  పట్టణ అభివృద్దే నా ప్రధాన లక్ష్యం అని, అన్ని వార్డుల్లో ప్రధాన రహదారుల్లో  రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే డాక్టర్ “బీవీ జయనాగేశ్వర రెడ్డి”  అన్నారు. పట్టణ అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ సర్కిల్, శ్రీనివాస సర్కిల్, సోమేశ్వర థియేటర్, బసవన్న గుడి, ఆర్.సి.యం చర్చ్, గంజిల్లా రోడ్డు, మార్కెట్ యాడ్ ప్రధాన రహదారులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి  సందర్శించారు.  తేరు బజారులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథం ఇరువైపులా రోడ్డు వేయాలని అధికారులకు ఆదేశించారు.  శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయం లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ కూడా ఒక గుంత కూడా కనిపించకుండా చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో రోడ్డు వేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సంబంధిత ఆయా శాఖ అధికారులు, టిడిపి నాయకులు, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.

About Author