PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ ఉర్దూ టిచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉర్దూ సెమినార్”

1 min read

పల్లెవెలుగు న్యూస్ నంద్యాల:  ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ టిచర్స్ అసోసియేషన్ మరియు “జొయ ఉర్దూ కోచింగ్ సెంటర్” ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఉన్నత ఉర్దూ బాలికల పాఠశాల, ముల్లాన్ పేట, నందు “భారత దేశ స్వతంత్ర పోరాటం లో ముస్లింల పాత్ర” అన్న అంశంపై ఒక రోజు జిల్లా స్థాయి ఉర్దూ సెమినార్ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనూప్ కన్వీనర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా జమాఆతె ఇస్లామి హింద్ నంద్యాల అధ్యక్షుడు అబ్దుల్ సమద్ పాల్గొన్నారు.భారత దేశ స్వతంత్ర పోరాటం లో ముస్లింల పాత్ర” అంశంపై పది మంది విద్యార్థులు వ్యాసం వ్రాసి వినిపించిన మీదిట అసోసియేషన్ వారికి సమర్పించారు.ఈ సందర్బంగా ముఖ్య అతిథి అబ్దుల్ సమద్ మాట్లాడుతూ  భారత దేశ  స్వతంత్ర పోరాటంలో ముస్లిములు పెద్దా సంఖ్య ప్రాణం త్యాగాలు చేసారని, వారిని గుర్తు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ టిచర్స్ అసోసియేషన్, జొయ ఉర్దూ కోచింగ్ సెంటర్ , సంయుక్తంగా ఒక రోజు ఉర్దూ సెమినార్ నిర్వహించండం హర్షనీయం అన్నారు. విద్యార్ధులు చక్కటి వాగాధాటితో తమ వ్యాసాలు వినిపించారు. భారత దేశానికి మన పూర్వీకులు చేసిన త్యాగాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ విద్యార్థులలో దేశ భక్తి ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వ్యాసాలు సమర్పించిన వారికి మెమోంటొ, ప్రశంస పత్రాలు అందజేశారు..ఈ కార్యక్రమంలో జడ్జీలు గా అబ్దుల్ అజీజ్, అంజద్ షరీఫ్ వ్యవహరించారు..ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ టిచర్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు, ఎన్. ఎమ్. డీ. ఫజ్లూర్ రహమాన్, ఇబ్రహీం, షమీమ్ బాను, ఎండి. నౌమాన్ బాష, ఎండి. ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.

About Author