PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పీడబ్ల్యుజే ఎఫ్ ఏలూరు నియోజకవర్గ ప్రెసిడెంట్ గా వి. జయరాం ఏకగ్రీవ ఎన్నిక

1 min read

జర్నలిస్టుల సంఘటిత పోరాటమే విజయం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు

పలువురు జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కు నియోజకవర్గానికి  పది వేలు అందిస్తామని ప్రకటన

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఏలూరులో నిర్వహించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ మన సంఘంలో ఎవరికి కష్టం వచ్చినా సంఘాలకు అతీతంగా ఐక్యమత్యంతో జర్నలిస్టుల కోసం నిలబడాల్సిందేనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు ప్రమాదం పొంచి ఉందని సంఘటతంగా పోరాడి వాటిని ఛేదించే దిశగా అందరం కలిసికట్టుగా ఉండాలన్నారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘంలో మరియు ఏ ఇతర సంఘంలో ఏ జర్నలిస్టు అనారోగ్యానికి గురైన,ప్రమాదవశాత్తు, అంగవైకల్యమైన, మరణించిన తగిన విధంగా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుండాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసుకోవాలని ఆ ఫండ్ ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఉపయోగపడతాయని సూచించారు. ముందుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ తన వంతుగా వేయ్యి రూపాయలను ప్రకటించి అందించారు. ఈ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఏలూరు నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన వి జయరాం పది వేలు రూపాయలు ప్రకటించగా, జంగారెడ్డిగూడెం నియోజకవర్గం నుండి పది వేలు, దెందులూరు నియోజకవర్గం నుండి పదివేలు, గోపాలపురం నియోజకవర్గం నుండి పదివేలు ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులు యర్రా జయదాస్ ప్రతిపాదించిన జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్  అంశం పై లేవనెత్తగా 15 నిమిషాల్లో సుమారు 50 వేల రూపాయలు పలు నియోజకవర్గాల నుండి ప్రకటించడం అందరూ హర్షద్వనాతో అభినందించారు.అనంతరం ఏలూరు నియోజకవర్గ నూతన కమిటీని  ఎన్నుకున్నారు. ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వీరఘట్టం జయరాం, ఉపాధ్యక్షులుగా పిల్లి మిల్టన్ ప్రతాప్, కార్యదర్శిగా డి. దొరబాబు, జాయింట్ సెక్రటరీగా ఇ సజ్జి మ్యాచుస్, సి.హెచ్ వెంకటేశ్వర్లు, కోశాధికారిగా చదలవాడ. ప్రతాప్ కుమార్, మెంబర్లు గా జి. ప్రదీప్ కుమార్ శామ్యూల్ ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ కమిటీని దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె శంకర్రావు, స్టేట్ కమిటీ మెంబర్ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కె బాల సౌరి, జిల్లా అధ్యక్షులు జబీర్, కార్యదర్శి వై హరీష్, ఉపాధ్యక్షులు కె సోమశేఖర్, యర్రా జయదాస్,దెందులూరు కమిటీ సభ్యులు అధ్యక్షులు తిలారపు రుషీరావు, ప్రధాన కార్యదర్శి తోట వెంకట్రావు, కోశాధికారి దరిసి. సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పి కళ్యాణ్, సిహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *