వచ్చేది వైకాపా ప్రభుత్వమే…
1 min readమరో సారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం
ఈసీ అనుమతి తో అన్నదాతలకు పంట నష్ట పరిహారం చెల్లింపు
అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పై దృష్టి సారిస్తాం
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ఇటీవల జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జగన్ మరో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ వారు ఎన్నికల ముందు పథకాలకు సంబంధించిన డబ్బులు చెల్లించకుండా ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేసి చెల్లింపులు నిలిపివేశారు తెలిపారు. చెప్పిన మాట ప్రకారం అన్నదాతకు చెల్లించాల్సిన పంట నష్ట పరిహారం ను అదే ఎన్నికల సంఘం అనుమతి తో చెల్లించడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా వైకాపా వైపే నిలిచారని తెలిపారు. జూన్ 4వ తేదీన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి సారిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు నేపథ్యంలో నియోజకవర్గంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలను ఎవ్వరూ రెచ్చగొట్టిన రెచ్చి పోకుండా సమన్వయంతో ఉండాలని సూచించారు. నియోజకవర్గంలోని మంత్రాలయం మండలం లో 11,755 మంది రైతులకు రూ 14,44కోట్లు, పెద్దకడబూరు మండలంలో 15,674 రైతులకు 16,34 కోట్లు, కోసిగి 12,230 రైతులకు రూ 15,84 కోట్లు, కౌతాళం మండలంలో 17,882 మంది రైతులు రూ 27,45 కోట్లు నియోజకవర్గంలోని 57,541 మంది రూ 74, 08 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అంతకు ముందు తుంగభద్ర గ్రామంలో వెలసిన శ్రీ కన్యాకపరమేశ్వరి జయంతి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.