టిడిపి లో చేరిన వైకాపా నాయకులు
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని సూగురు గ్రామానికి చెందిన వైకాపా నాయకులు మాజీ సర్పంచ్ కురువ ఈరన్న, మాజీ గోర్రెలు పెంపకదారుల సంఘం చైర్మన్ నాగేంద్రప్ప,రజకుల సంఘం నాయకులు భీమేష్ తో పాటు మరి కొంత మంది అలాగే మంత్రాలయం కు చెందిన మొండి హనుమంతు, తిక్క స్వామి 15 కుటుంబాలు వైకాపా కార్యకర్తలు స్వర్గీయ ఎన్టీ ఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి ఆధ్వర్యంలో టిడిపి లో చేరారు. వీరికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి టిడిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తూన్న మంచి పనులు, అభివృద్ధిని చూసి కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి కార్యకర్తలకు అండగా ఉండే విధానం చూసి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగిందని తెలిపారు. చేరిన వారు మాట్లాడుతూ తిక్కారెడ్డి అడుగు జాడలో నడిచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి, పన్నగ వెంకటేష్ స్వామి, అమర్నాథ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి లకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా కార్యదర్శి యల్లారెడ్డి, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, యువ నాయకులు మాధవరం క్రిష్ణా మోహన్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, వట్టేప్ప నర్సింహ, సున్నం రామకృష్ణ, సంత మార్కెట్ పాఠశాల ఛైర్మెన్ సున్నం గురురాజ, పవన్ కూమార్, టిడిపి లో చేరిన వారు సూగురు బసవరాజు,అంజినప్ప,వీరనాగుడు,దేవేంద్ర,అయ్యళప్ప,ముక్రప్ప,తరసాలి ,సుర్యప్రకాష్, నరసింహులు , నాగరాజు,తోటయ్య,నవిన్, మహబూబ్ బాషా, మంత్రాలయం మహేష్, రాముడు,గురురాజా, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.