వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఆహ్వానం పత్రిక అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 11 గంటలకు రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాల గురించి కర్నూల్ నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ని కలిసి రేపు ఆలయ ప్రాంగణము చుట్టుపక్కల పరిశుభ్రత బ్లీచింగ్ పౌడర్ చల్లుట మంచినీటి వసతి ఏర్పాటు గురించి చర్చించి అలాగే బ్రహ్మోత్సవాలు కూడా తగు ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతూ వారికి ఒకరు ప్రజెంటేషన్ ఇస్తూ ధనుర్మాస ప్రసాదం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కండువా కప్పి ఆశీర్వదించి రావడం జరిగింది, అలాగే రేపటి వైకుంఠ ఏకాదశికి మరియు బ్రహ్మోత్సవాలకు కూడా తగిన బందోబస్తు తగిన అనుమతులు స్వామివారి ఊరేగింపునకు మైకు పర్మిషన్ కోరుతూ పట్టణ డిఎస్పి శ్రీ బాబు ప్రసాద్ కి కూడా కలిసి స్వామివారి ప్రసాదము కండువా బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రము అలాగే మన రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఆశీర్వదించి రావడం జరిగింది. మరియు రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రావు కి కూడా కలిసి స్వామివారి ప్రసాదము కండువా మరియు ఆహ్వాన పత్రం ఇస్తూ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానము పలుకుతూ మరియు మన రిప్రజెంటేషన్ ఇస్తూ తగిన బందోబస్తు ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది దానికి వారు స్పందిస్తూ ఉదయం నాలుగు గంటల నుంచి వైకుంఠ ఏకాదశి గాను తగిన బందోబస్తు ఏర్పాటు చేయగలమని చెప్పేసి వారు భరోసా ఇవ్వడం జరిగింది దీనికి మేము సంతోషించి వారు కూడా ఆశీర్వచనాలు అందజేసి రావడం జరిగింది.