వాల్మికి మహర్షి జయంతి వేడుకలు
1 min readపాల్గొన్న వివిధ శాఖల జిల్లా అధికారులు
వాల్మికి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
మహనీయులను స్మరించుకోవడం మనందరి, భావితరాల బాధ్యత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా వారి మార్గంలో పయనించి అనుకున్న లక్ష్యాలను సునాయాసకంగా సాధించకలుగుతారని వాల్మికి మహర్షి జీవిత చరిత్ర నిదర్శనమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో గురువారం జిల్లా బి.సి. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మికి మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా వాల్మికి మహర్షి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, జిల్లా రజక సంఘం అధ్యక్షులు సిహెచ్ కట్లయ్య, తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ సంస్కృతంలో రామాయణాన్ని ఆదికావ్యంగా వ్రాసిన వాల్మికి మహర్షి ఆదికవిగా నిలిచారన్నారు. మహనీయులను స్మరించుకోవడం మనందరి మరియు భావితరాల బాధ్యతని జిల్లా కలెక్టర్ కె జిల్లా కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నజిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, జిల్లా రజికసంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్ కట్లయ్య, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తదితరులు మహర్షి వాల్మికి గుణగణాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా బి.సి. సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, బి.సి. కార్పోరేషన్ ఇడి డి. పుష్పలత, డిఆర్డిఏ పిడి ఆర్. డాక్టర్: విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఎన్.ఎస్. కృపావరం, డిపివో కె. అనురాధ, సెట్ వెల్ సిఇఓ కె. ప్రభాకరరావు, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, పశు సంవర్ధక శాఖ జెడి జి. నెహ్రూబాబు, ఎపిఎంఐపి పిడి రవికుమార్, సెరీ కల్చర్ డిడి డి. వాణి తదితరులు పాల్గొని మహర్షి వాల్మికి కి నివాళులర్పించారు.