PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి అందరికీ ఆదర్శం…

1 min read

విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు తెలుగు చిన్న మద్దిలేటి….

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉ.10:00 గం.లకు గౌరీ గోపాల్ వైద్యశాల వద్దగల మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కర్నూలు జిల్లా అధ్యక్షులు తెలుగుచిన్న మద్దిలేటి మాట్లాడుతూ…..అడవిలో వేటాడుకుంటూ జీవించే రత్నాకరుడ నే బోయవాడు…సాక్షాత్ ధర్మమూర్తి,మానవ జాతికి ఆదర్శ ప్రాయుడైన భగవాన్ శ్రీరామచంద్రమూర్తి చరిత్రను రచించి “మహర్షి వాల్మీకి” గా చరిత్రకెక్కాడు, అంతటి అధ్భుతమైన రామాయణం మహాకావ్యం రచన సులువుగా జరుగలేదు నారదమహర్షి ఆజ్ఞ తో ఆయన బోధించిన “రామనామ తారక మంత్రం” నిరంతరంగా  ఎన్నోవేల సంవత్సరాలు దీక్షతో  తపస్సు చేస్తున్న సమయంలో అతని చుట్టూ పుట్టలు పేరుకుపోయాయట, రత్నాకరుడిగా తపస్సు ప్రారంభించి వల్మీకం నుండి బయటికి వచ్చాడు కావునా వాల్మీకి కి గా ప్రసిధ్ధి చెందాడు.అంతటి తపఃఫలమువల్లే శ్రీ రామాయణం వంటి “ఆది మహా కావ్య ” రచన  సాధ్యపడిందని తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత రాష్ట్ర సభ్యులు గోరంట్ల రమణ మాట్లాడుతూ..రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందనీ,భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ రామాయణ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము.రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. రామాయణము లోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.ఈ రోజున మనం పాడుకుంటున్న…చదువుకుంటున్న మహాకావ్యం రామాయాణాన్ని రచించి లోకప్రసిధ్ధుడైనాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  సందడి మహేష్ రాష్ట్ర కోశాధికారి, గోవిందరాజులు జిల్లా ఉపాధ్యక్షులు,  ఈపూరి నాగరాజు జిల్లా సహకార్యదర్శి, సాయిరాం జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్, శివ బజరంగ్ దళ్ సురక్ష ప్రముఖ్, తుంగా రమేష్ జిల్లా సేవా కన్వీనర్, కోరుకుంట్ల సంజీవయ్య,జయప్రకాశ్ సింగ్, jk.మహేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.

About Author