విజయవంతంగా వనం-మనం కార్యక్రమం
1 min readప్రతి ఒక్కరూ నివసించే ప్రదేశంలో ఒక మొక్క నాటాలి
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ హరిత ఆంధ్ర ప్రదేశ్ వనం-మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలో హెడ్ వాటర్ వర్క్స్ ప్రాంగణం నందు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బడేటి కంటే ప్రతి ఒక్కరూ వారు నివసించే ప్రదేశంలో ఒక మొక్క నాటి వన సంపదను పెంచాలన్నారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉండాలంటే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ భాను ప్రతాప్, డివిజన్ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.