వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు ఏలూరు రైల్వేస్టేషన్ లో హాల్టు సాధించిన ఎంపీ
1 min readఎంపీకి జిల్లా వాణిజ్య ,వర్తక ప్రజలు అభినందనలు వెల్లువ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అవిశ్రాంత కృషి ఫలితంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను ఏలూరులో నిలుపుదల చేయుటకు రైల్వేశాఖ అంగీకరించింది. ఈ మేరకు రైల్వే బోర్డు జాయింట్ డైరక్టర్ (కోచింగ్) వివేక్ కుమార్ సిన్హ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అనతికాలంలో సాధించిన రెండో విజయం గా ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో పుట్టా మహేష్ కుమార్ సఫలమయ్యారు.ఏలూరు లో వందే భారత్ రైలు నిలుపుదల కోసం రైల్వే బోర్డు ఛైర్మన్ మరియు సిఇవో జయ వర్మ సిన్హ తదుపరిగా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ లను కలిసి రైలు నిలుపుదల కోసం పలు దపాలుగా చర్చలు జరిపారు. తదుపరి పార్లమెంట్ లో కూడా ఎంపీ తన గళాన్ని సమర్ధవంతంగా వినిపించారు. ఎంపీ. అహర్నిశల కృషి ఫలితంగా సాధించిన విజయంపై జిల్లాలోని వర్తక వాణిజ్య వర్గాలతో పాటుగా ప్రజలందరిలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. జనవరి 18, 2023న ప్రారంభించిన వందేభారత్ రైలు ఏలూరు హాల్టు కు గత 20 నెలలుగా ఏలూరు ప్రజలు ఎదురుచూస్తున్న ఈ రైలు కోసం అటు విజయవాడ, ఇటు రాజమండ్రి వెళ్ళేవారు, ఇప్పుడు వారికి ఉపశమనం లభిస్తుంది. ఏలూరుకు వందేభారత్ రైలు నిలుపుదల సాధించిన ఎంపీ కి జిల్లా ప్రజలు అభినందనలతో ముంచెత్తారు. ఏలూరు జిల్లా ప్రజల తరుపున రైల్వే మంత్రి ఆశ్వని వైష్ణవ్ కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఎంపీ మహేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఎంపీలను సంబంధిత కేంద్రమంత్రులు, వాణిజ్య కార్యదర్శులను పదే పదే కలసి వర్జీనియా పొగాకు రైతులకు 110 కోట్ల లబ్ది సాధించిన విషయం తెలిసిందే అన్నారు.