PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారాహీ నవరాత్రులు.. సామూహిక కుంకుమార్చనలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ మహా గౌరీ అమ్మవారి ఆషాడమాస వారాహీ నవరాత్రుల సందర్భంగా ఉదయం గణపతి పూజ, మండపారాధనం, శ్రీదేవి ఖడ్గమాల, లలితా సహస్రనామార్చనలు, సామూహిక కుంకుమార్చనలు జరిగినవి. తిరిగి సాయంకాలం ప్రదోషకాల అర్చన పాదుకానుష్టాన అర్చన శ్రీ వారాహీ సహస్రనామార్చనలు జరిగినవి. మరియూ నవరాత్రుల సందర్భంగా అంగ, ఉపాంగ, ప్రత్యంగ దేవతా వారాహి మూల మంత్ర హోమం వారాహి సహస్రనామ హోమం జరిగినవి. అన్ని కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించినారు భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగినది.

About Author