దొరకని వాసంతి మృతదేహం.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
1 min readజాతీయ రహదారిపై ధర్నా ఉద్రిక్తత
24 గంటలు సమయం ఇవ్వండి:అడిషనల్ ఎస్పీ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల పగిడాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన చిన్నారి వాసంతి (9) మృతదేహం ఐదు రోజులు అయినా కూడా దొరకపోవడంతో తల్లిదండ్రులు బంధువుల్లోనూ మరియు ప్రజల్లోనూ ఉత్కంఠత నెలకొంది.నంద్యాల జిల్లా నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ముందు కేజి రోడ్డుపై వాసంతి తల్లిదండ్రులు బంధువులు గ్రామస్తులు గురువారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు మైనర్లు వాసంతి మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల కెనాల్ లో వేసినట్లు మైనర్లు ఒప్పుకొని ఐదు రోజులైనా ఇంతవరకు వాసంతి మృతదేహాన్ని పోలీసులు కనుక్కోలేక పోయారని వాసంతి తల్లిదండ్రులు బంధువులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు.అదృశ్యమైన వాసంతిని ఐదు రోజులు గడుస్తున్నా బాలిక వాసంతి జాడ కనుక్కోలేకపోయారని వాసంతి తల్లిదండ్రులు బంధువులు గ్రామస్తులు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు.తమకు న్యాయం జరిగేంత వరకు కేజీ రోడ్డుపై ధర్నా విరమించే లేదని భీష్మించుకున్నారు జాతీయ రహదారిపై ఆందోళన వాతావరణం నెలకొంది వాహనాలు రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాసవి తల్లిదండ్రులు,గ్రామస్తులు, బంధువులు వాసంతి జాడను 24 గంటల్లో కనుక్కుంటామని నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.ఒకవేళ పోలీసులు వాసంతి ఆచూకీ తెలుపకపోయినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా కుల సంఘాలను కలుపుకొని ఆందోళనకు దిగుతామని వాసంతి తల్లిదండ్రులు బంధువులు గ్రామస్తులు హెచ్చరించారు.