PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకి చిన్నారి వాసంతి” ఆత్మకు శాంతి చేకూరాలి 

1 min read

“ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS)” ఆధ్వర్యంలో

చిన్నారి “వాల్మీకి వాసంతి” కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ

పల్లెవెలుగు వెబ్  హొళగుంద : ఈ రోజు హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నందు వాల్మీకి చిన్నారి వాసంతి ఆత్మ శాంతించాలని కొవ్వొత్తులతో  05 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.ఈ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS) కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ వాల్మీకి యువ నాయకులు శ్రీరంగ దిడ్డి తిక్క స్వామి హైకల్ మల్లికార్జున రారాయి సిద్దు మసాలా గ్రూప్ సభ్యులు పత్రిక విలేఖరి భాష మైనార్టీ సంఘం నాయకులు హమీద్ మాధసీ మాధవి కురువ మల్లయ్య మాట్లాడుతూ చిన్నారి వాల్మీకి కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం 10 లక్షలు అందించి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఈ అఘానిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అతి చిన్న వయసులోనే ఇలాంటి అగనిత్యాలకు పాల్పడుతున్న మైనర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని కఠినమైన సెక్షన్లో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఇలాంటి అత్యాచారాలకు పాల్పడిన వారితోపాటు వారి తల్లిదండ్రులను కూడా చర్యలు తీసుకుని జీవోలు విడుద చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అభం శుభం తెలియని ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు పార్టీలకు అతీతంగా కులమతలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.చిన్నారి వాల్మీకి వాసంతి ఆత్మ శాంతించాలని మైనార్టీ నాయకులు మాసాల గ్రూప్ సభ్యులు మాదాసి మాదరి కురువ నాయకులు మద్దతు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాల్మీకి సీనియర్ నాయకులు బి.జె. పంపాపతి దిడ్డి వెంకటేష్ దిడ్డి నాగప్ప ఏరిస్వామి సింధువాళ్లం కృష్ణ బకాడి దొడ్డబసప్ప తుంబలం గాదలింగ బండ్రాల వెంకటేష్ వాల్మీకి యువ నాయకులు తుంబలం సిద్ధప్ప దిద్ది చిన్న మల్లయ్య తిక్కస్వామి ఐకల్ మల్లికార్జున రారాయి సిద్దు కోనేరు భాస్కర్ కోగిలతోట రంగన్న వీరాంజి సవరప్ప వెంకటరాముడు వెంకటేష్  కురువ సంఘం నాయకులు పెద్దహ్యట మల్లయ్య మసాలా గ్రూప్ నాయకులు పత్రిక విలేఖరి భాష మైనార్టీ సంఘం నాయకులు హమీద్ అబ్దుల్ సుభాన్ అన్ని పార్టీల కుల మతాలకు అతీతంగా పెద్దహ్యాట వీరేష్ ఈరెత్తినే అశోక్ వెంకటేష్ శ్రీధర్ శ్రీను మంజు తిమ్మప్ప సిద్దు మన మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల వారు తదితరులు పాల్గొన్నారు.

About Author