ఆర్యూ విద్యార్థులకు మెరుగైన క్యాంపస్ ప్లేస్మెంట్ల కు వీసి కృషి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయ విద్యార్థులకు మెరుగైన క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించే విధంగా కృషిచేస్తున్నట్లు వర్సిటీ వైఛ్ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ తెలిపారు. వర్సిటీలోని వివిధ విభాగాలను పరిశీలించడంలో భాగంగా రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడుతో కలిసి ఆయన ఈరోజు వర్సిటీలోని కేరీర్ గైడెన్స్ మరియు ప్లేస్మెంట్ విభాగాన్ని సందర్శించారు. ప్లేస్మెంట్సిల్ కార్యకలాపాలను వర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ జి. రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. 2023 – 24 సంవత్సరంలో కరూర్ వైశ్యాబ్యాంక్, HDFC బ్యాంక్, ఎసాఫ్ బ్యాంక్, టాటా గ్రూపు, కెవిన్కర్, రైనెక్స్ టెక్నాలజీస్, క్యూస్పైడర్స్ మొదలైన 11 సంస్థల్లో 59 మంది వర్సిటీ ఆర్ట్స్ మరియు సైన్స్ కాలేజినుండి విద్యార్థినీ విద్యార్థులు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకున్నారని, ప్రస్తుత 2024- 25 విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 3 సంస్థల్లో 23 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు డాక్టర్ రామకృష్ణ వి.సి., రిజిస్ట్రార్లకు వివరించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సులర్ గ్రామీణ నేపథ్యంనుండి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేసి ఉద్యోగావకాశాలు మెరుగు పరచుకొనేలా ప్రణాళికలు సిద్ధంచేయాలని ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరం మరిన్ని కంపెనీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థినీ విద్యార్థులకు మరిన్ని ప్లేస్మెంట్ అవకాశాలు వచ్చేట్లుగా కృషిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. వర్సిటీ ప్లేస్మెంట్ విభాగాన్ని మరింత బలోపేతంచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆచార్య నాయక్ హామీ ఇచ్చారు.