PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పవర్ పేట లో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన..

1 min read

వీరబ్రహ్మేంద్రస్వామి రచనలు డిజిటలైజ్  చెయ్యాలి

ఏపీ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ప్రధాన సంచాలకులు అప్పల భక్తుల శివశ్రీ

శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం డిమాండ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వీరబ్రహ్మేంద్రస్వామి వ్రాశిన తాళపత్రగ్రంధాలనఉడిజటలైజ్ చెయ్యాలని పండితులకుమాత్రమే పరిమితమైన ఆత్మవిద్య వేదవిద్య యోగవిద్యను కులమతబేధంలేకుండా పామరులకుసయితంపంచిపెట్టిన మహిమాన్మితుడు పోతులూరివీరబ్రహ్మేంద్రస్వామియని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణధర్మపీఠం ప్రధానసంచాలకులు అప్పలభక్తులశివకేశవరావు శివశ్రీ పేర్కొన్నారు. వైశాఖశుధ్ధదశమి శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనామహోత్సవాలు జిల్లావ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామానా నిర్వహించారు. ఏలూరుపట్టణంలోని శ్రీవిశ్వబ్రాహ్మణసంఘంఆధ్వర్యంలోపవర్ పేటసంఘకార్యాలయంలోను పడమటవీధిబ్రహ్మంగారిఆలయంలోను మాదేపల్లి బ్రహ్మంగారి ఆలయంలోను బ్రహ్మంగారి ఆరాధనామహోత్సవాలు వైభవంగా భక్తిశ్రధ్ధలతో నిర్వహించారు.అఖండజ్యోతిప్రజ్వలన ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులకుతీర్ధప్రసాదాలు పంచారు ఈకార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శివశ్రీమాట్లాడుతూ సంసారజీవితాన్ని గడుపుతూ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తూనే మానవజీవితలక్ష్యం అయిన మోక్షాన్ని పొందవచ్చని మోక్షసాధనకు కులమతాలు అడ్డుకాదని ప్రతిమనిషిలోను భగవంతుడున్నాడని నిరూపించి మనలోనేఉన్నపరమాత్మనుదర్శించితరించేయోగవిద్యను సయితంకరతలామలకం చేశిన మహోన్నతుడువీరబ్రహ్మేంద్రస్వామి అనితెలిపారు. ఆయనసాహిత్యం నేటిసమాజంలోని అనేకరుగ్మతలకు పరిష్కారాన్ని సూచిస్తుందనితెలిపారు.వీరబ్రహ్మేంద్రస్వామి కాలఙ్ఞానంతోపాటు సంఘసంస్కరణకు ఆధ్యాత్మికసత్యాన్ని వివరించేందుకు రచించిన అనేకరచనలపై అధ్యయనంచేశి నేటిసమాజానికి వ్యాప్తిచెయ్యవలశిన అవసరంఉందన్నారు. స్వామివారువ్రాశిన అనేకతాళపత్రగ్రంధాలు కాలగర్భంలోకలిశిపోతున్నాయని వీటన్నిటిని శేకరించిడిజిటలైజేషన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. చెయ్యవలశినబాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈఆరాధనాకార్యక్రమంలో శ్రీవిశ్వబ్రాహ్మణసంక్షేమసంఘ అధ్యక్షులు సింహాద్రిభృంగాచార్యలు కార్యదర్శి మానేపల్లినాగేశ్వరరావు గౌరవ అధ్యక్షులు వేములదుర్గాప్రసాద్  వడ్రంపనివారలసంక్షేమసంఘ అధ్యక్షులు పొట్నూరిశివరావు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణకార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజు రాజగోపాలాచారితదిరులుపాల్గొన్నారు.

About Author