PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

23 న వీర హనుమాన్ విజయ శోభాయాత్ర…

1 min read

విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ…..

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11:00 గం.లకు కేసీ కెనాల్ ప్రక్కన గల శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆలయం(వినాయక ఘాట్) సమావేశ మందిరం లో పత్రికా విలేఖరుల మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం లో కర్నూలు జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ… ఈనెల 23 వ తేదీ చైత్రశుద్ద పౌర్ణమి రోజున వీర హనుమంతుని జన్మదినం” హనుమజ్జయంతి ” సందర్భంగా ఆనవాయితీ గా ప్రతి సంవత్సరం శ్రీ వీర హనుమాన్ విజయ శోభాయాత్ర యాత్ర పేరుతో నిర్వహిస్తున్నామని కానీ ఈ సం. భగవాన్ బాలక్ రామ్ మహి ప్రాణప్రతిష్ట జరిగిన సందర్భంగా , మరియు విశ్వ హిందూ పరిషత్ షష్ఠ్యబ్ది ఉత్సవాల్లో భాగంగా సంఘటితమై న హిందూ సమాజాన్ని, మరీ ముఖ్యంగా హిందూ యువతను సరైన మార్గంలో నడిపించడం కోసం…విశ్వ హిందూ పరిషత్ యువ విభాగమైన బజరంగ్ దళ్ ను బలోపేతం చేయడం కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ శోభాయాత్ర లో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి ,జాతీయ నాయకులు యాత్ర ను ప్రారంభిస్తారని తెలియజేశారు. ఉపాధ్యక్షులు డా. లక్కిరెడ్డి అమరసింహా రెడ్డి మాట్లాడుతూ 500 సం.పోరాటం తరువాత దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్ఛిన తీర్పు తో గత జనవరి 22 వ తేదీన అంగరంగ వైభవంగా భగవాన్ బాలక్ రామ్ మహా ప్రాణప్రతిష్ట జరగటానికి ఎంతో మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు తమప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని వారిని గుర్తుచేసుకుని , వారి త్యాగానికి స్పూర్తి పొంది ప్రతి హిందూ యువకుడు బజరంగ్ దళ్ లో చేరాలని ఈసందర్భంగా పిలుపునిస్తున్నా మన్నారు. బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ మీనుగ రాజేష్ మాట్లాడుతూ చైత్ర శుద్ధ పౌర్ణమి 23వ తేదీన సా: 4:30 గంటలకు కర్నూలు పాత నగరంలోని జమ్మి చెట్టు వద్ద గల శ్రీ లలితా పీఠం నుండి ప్రారంభమై చిత్తారి వీధి,కుమ్మరి వీధి కూడలి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడలి, పూల బజార్ కూడలి మీదుగా గడియారం ఆసుపత్రి పెద్ద మార్కెట్ డా. బి.ఆర్ అంబేద్కర్ కూడలి మీదుగా కొండారెడ్డి బురుజు వద్దకు చెరుకుని అక్కడ ఒక మారు “సామూహిక హనుమాన్ చాలీసా” పారాయణం అనంతరం యాత్ర కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడలి, గోశాల మీదుగా స్వామి వివేకానంద కూడలి చేరుకుని అక్కడి నుండి బుధవారపేటలోని ఓం సాయి శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుని అక్కడి ఉన్న హనుమాన్ మూర్తికి పూజలు చేసిన అనంతరం మహా మంగళ హారతి తో కార్యక్రమం సమాప్తము వుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి కర్నూలు నగరంలో ఉన్న హిందూ యువకులు, కుల సంఘాల నాయకులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు , సేవా సంస్థల ప్రతినిధులు, కళాశాలల విద్యార్థులు , పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని  కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్,  బజరంగ్దళ్ విభాగ్ కన్వీనర్ నీలి నరసింహ, విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భాను ప్రకాష్ , సహకార దర్శులు గూడూరు గిరిబాబు,  గోవిందరాజులు ,కోశాధికారి అయోధ్య శ్రీనివాస రెడ్డి, నగర బజరంగ్ దళ్ కన్వీనర్ తెలుగు భగీరథ,కారణం సుధాకర్, బాబూరావు,  తదితరులు పాల్గొన్నారు.

About Author