తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: స్థానిక మడివాల మాచ్చయ్య గుడి అవరణము నందు చాకలి ఐలమ్మ చిత్రపటానికి కురుకుంద నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూచిట్యాల ఐలమ్మ 1895 లో ఒరుగంటి మల్లమ్మ, సాయిలకు నాల్గవసంతానంగా కిష్టపురం గ్రామం వరంగల్ జిల్లాలో జన్మించింది పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యను పెళ్లి చేసుకుంది.వీరికి నలుగురు కొడుకులు, ఓ కూతురు , కులవృత్తితో కుటుంబాన్ని పోషించుకోలేని ఉద్దేశంతో, భూమినే నమ్ముకున్న ఐలమ్మ.పాలకుర్తిలోమల్లంపల్లి భూస్వామి కొండలరావు దగ్గర 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది. రజక కులానికి చెందిన ఐలమ్మ, 80 ఎకరాల దొర భూమిని ప్రజలకు పంచారు. 10 లక్షల ఎకరాల భూపంపడం జరిగింది. ఐలమ్మ ఉద్యమం స్ఫూర్తికి ప్రదాత, చివరకు 1085 సెప్టెంబర్ 10న ఐలమ్మ అనారోగ్యంతో. తుది శ్వాస విడిచింది.భూమికోసం, భుక్తి కోసం, పట్టిచాకిరి విముక్తి కోసంనిజాం హయాంలోని భూస్వామిక శక్తులు, దొరల పెత్తనాన్ని ఎదిరించిన ధీశాలి చిట్యాల ఐలమ్మ. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాబానికి దారి చూపిన వీరమాత, సాయుపోరాటానికి బలమ్మ వేడికైంది. దెబలకు వెనకడుగు వేయలేదు. లాటీలు, తూటాలను లెక్క చేయలేదు. భూమి నాది, పంట నాది మధ్యలో నీ పెత్తనమేందని దొరల అరాచకాలపై మాటల తూటాలు పేల్చిన వీర వనిత ఐలమ్మ. మహిళల్లో చైతన్యం రగిల్చి, కూలీలు, రైతుల్ని ఏకతాటిపైకి తెచ్చిన మహా యోధురాలు చిట్యాల ఐలమ్మ.దున్నే వాడితే భూమని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చిట్యాల ఐలమ్మ నిప్పుకనిక.ఈ కార్యక్రమంలో లక్ష్మన్న lic మల్లికార్జున,నాగరాజు, కరెంటు మల్లి,యశ్వంత్,వీరన్న పాల్గొన్నారు.