ముందస్తుగానే వాహనాల పన్నులు చెల్లించాలి
1 min readఉప రవాణా శాఖ కమిషనర్ షేక్ కరీం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: వాహనాలకు పన్ను చెల్లించాల్సిన యజమానులు ఈ త్రైమాసిక పన్నును ముందుగానే చెల్లించాలని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ షేక్ కరీం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్వార్టర్ నుంచి వాహన వెబ్సైట్ (నేషనల్ సాఫ్ట్వేర్) ద్వారా పన్నులు చెల్లించే కారణంగా ముందుగానే ఆయా వాహన సంబంధిత మండల మ్యాపింగ్, ఈ కేవైసీలు వెబ్ సైట్లో నమోదు చేయించుకోవాలని కోరారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో మోటారు వాహన కేసులు బకాయి ఉన్నచో త్వరగతిన ఆ రాష్ట్రాల్లోనే అపరాధ రుసుం చెల్లించాలని సూచించారు. లేనిచో ఆన్లైన్లో టాక్స్ తీసుకోరన్నారు. వాహనదారులు పెండింగ్లో ఉన్న తమ వాహన పన్ను జరిమానాలను వెంటనే చెల్లించి సహకరించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా జరిమానా చెల్లించని వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆఖరి రోజు వరకు ఉండి సాంకేతిక పరమైన సమస్యలతో ఇబ్బంది పడకుండా మోటారు వాహనాల యజమానులు ముందస్తుగానే పన్నులు చెల్లించడం వల్ల సమస్యలు పరిష్కరించుకోవచ్చని షేక్ కరీం తెలిపారు.